Sipa Awards 2021 Syrian Father And Son Wins Siena International Award
SIPA Awards 2021: Syrian Father And Son Wins Siena : సిరియా అంతర్యుద్ధంతో రగిలిపోతోంది. బాంబులతో దద్దరిల్లుతోంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో..ఏ బాంబు వచ్చి మీద పడుతుంది తెలిసిన పరిస్థితుల్లో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని జీవిస్తున్నారు. ఎంతోమంది అవయవాలు పోగొట్టుకుని వికలాంగులుగా మారిపోయారు. మగవారు, ఆడవారలనే తేడా లేదు. ఆఖరికి చిన్నారులు కూడా వికలాంగులుగా మారిపోయిన కడు దౌర్భాగ్యపు స్థితిలో కొట్టుమిట్టాడుతోంది సిరియా.
రాగాలు పలికే వేణువుకు నిలువెల్లా గాయాలే అన్నట్లు బోసినవ్వులు చిందించే చిన్నారులు..బుడి బుడి నడకలు నడవకుండానే రెండు కాళ్లు పోగొట్టుకున్న దారుణ స్థితులకు నిలయంగా మారింది సిరియా. గాయాలను ఆహ్వానించగలిగినవాళ్లే… గేయాలను రచించగలరంటాడో కవి. ఎన్నో గాయాల దుఃఖాల నుంచే కదా.. అసలైన నవ్వుల విలువ తెలుస్తుంది అంటాడో మరో కవి. ఆ గాయాలన్నీ మరిచి చిద్విలాసాలను చిందించడానికి ఎంతటి మనో ధైర్యం కావాలి? మరెంత మానసిక స్థైర్యం కావాలి అంటాడు మరో గొప్ప మాటలు చెప్పే తత్వవేత్త. ఈ మాటలు హృదయాల్ని పిండేస్తాయి. కదిలించేలా ఉంటాయి. కానీ మాటలు అన్నంత ఈజీ కాదు అలా ఉండాలంటే. కానీ సిరియాలో చిన్నారులు కూడా కష్టాలను కళ్లముందే పెట్టుకుని చిరునవ్వులు చిందించేత గొప్పతనం వారికే చెల్లిందేమో అనిపిస్తుంది..
Read more :Crazy Business : వాడేసిన అండర్ వేర్లు అమ్ముతున్న ఎయిర్ హోస్టెస్..లక్షల్లో సంపాదన
ఈ ఒక్క ఫోటో చాలు సిరియాలో పరిస్తితుల్ని కళ్లకు కట్టటానికి అన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూస్తే మనస్సు కదిలిపోతుంది. గుండెల్లో చేయి పెట్టి కెలికినట్లుంది. నిత్య యుద్ధాలనేల సిరియాలో జరిగిన ఓ బాంబుదాడిలో కాలును కోల్పోయాడు మున్జీర్. యుద్ధంలో వెలువడిన నెర్వ్ గ్యాస్‌ని పీల్చుకున్నందుకు కాళ్లు, చేతులు లేని కొడుకు ముస్తఫాకి జన్మనిచ్చింది తల్లి జీనెప్. సిరియాలో యుద్ధం తీసుకెళ్లిపోయిన తమ సంతోషాన్ని వెతుక్కుంటూ సరిహద్దుల్లోని దక్షిణ టర్కీలో స్థిరపడిందా కుటుంబం.
ఓ ఆహ్లాద సమయాన ఆ తండ్రీకొడుకుల నవ్వులను క్లిక్‌మనిపించాడు టర్కిష్ ఫొటోగ్రాఫర్ మెహ్మత్ అస్లన్. సియెనా ఇంటర్నేషనల్ ఫొటో అవార్డ్స్ –2021లో ఫొటో ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ‘సిరియాలో ఏం జరుగుతుందో ఈ ఒక్క ఫొటోతో ప్రపంచానికి చూపాలనుకున్నాను’అని చెప్పాడు అస్లన్.
Read more : Three Daughters same birthday : ఒకే నెల ఒకే తారీఖు..ఒకే జంటలకు పుట్టిన ముగ్గురు ఆడపిల్లలు