Three Daughters same birthday : ఒకే నెల ఒకే తారీఖు..ఒకే జంటలకు పుట్టిన ముగ్గురు ఆడపిల్లలు

ఒకే నెల ఒకే తారీఖు..ఒకే జంటలకు పుట్టిన ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. మూడు సంవత్సరాల తేడాతో ఒకే నెలలో ఒకే తేదీన ముగ్గురు ఆడపిల్లలు పుట్టటం విశేషం.

Three Daughters same birthday : ఒకే నెల ఒకే తారీఖు..ఒకే జంటలకు పుట్టిన ముగ్గురు ఆడపిల్లలు

Us Couples Three Daughters Share Same Birthday

US Couples Three Daughters share same birthday : ఒకే తేదిన లేదా ఒకే రోజున ఒక తల్లికి బిడ్డలు పుట్టటం. వాళ్లు కవలు కాకుండా అన్నా చెల్లెళ్లో లేదా అక్కా తమ్ముళ్లో అవుతుంటారు. ఇటువంటి సందర్భాలు కూడా చాలా అరుదుగా జరుగుతుంటాయి. అటువంటిది ఓ తల్లికి ఒకే నెల ఒకే తేదీన ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు పిల్లలు పుట్టారు.వారు ముగ్గురు ఆడపిల్లలే కావటం మరో విశేషం. అమెరికాకు చెందిన ఒక జంటకు ఎదురైంది ఈ అరుదైన అనుభవం. ఆ జంటకి మూడు సంత్సారాల తేడాతో ఒకే నెల ఒకే రోజు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. మరి ఇది విశేషమే కదా..

Read more : Crazy Business : వాడేసిన అండర్ వేర్లు అమ్ముతున్న ఎయిర్ హోస్టెస్..లక్షల్లో సంపాదన

యూఎస్ కు చెందిన క్రిస్టిన్ లామెర్ట్ ,రాబ్ వారెన్ భార్యాభర్తలు. వారికి సంవత్సరాల తేడాతో ఆగస్టు 25న తన ముగ్గురు ఆడపిల్లలకు జన్మించారు. క్రిస్టిన్ కు మొదటి ఆడపిల్ల సోఫియా ఇచ్చిన డెలివరీ డేట్ 2015 ఆగస్టు 23. రెండు రోజులు ఆలస్యంగా అంటే ఆగస్టు 25న జన్మించింది. రెండో పాప గియులియానాకి ఇచ్చిన డెలివరీ డేట్ 2018 ఆగస్టు 29. కానీ నాలుగు రోజులు ముందుగా ఆగస్టు 25న పుట్టేసింది గియులియానా. తరువాత మూడో పాప మియా కూడా ఊహించని విధంగా ఆమె పుట్టే డేట్ 2020 సెప్టెంబర్‌ 8. కానీ కన్నవారు కూడా ఊహించనివిధంగా మియా కూడా 14 రోజులకు ముందుంగా అదే తారీఖున అంటే ఆగస్టు 25రోజునే పుట్టింది. ఈ ముగ్గురు ఆడపిల్లలు సంవత్సరాల తేడాయేగానీ ఒకే నెలలో ఒకే తేదీన జన్మించటం చాలా చాలా అరుదుగా జరుగుతుంది.అది క్రిస్టిన్ లామెర్ట్ విషయంలో జరిగింది. ఈ అరుదైన ఘటనతో క్రిస్టిన్ దంపతులు తెగ సంతోష పడిపోతుంటారు.

Read more : 40 KM Speed Limit : స్పీడ్ 40 దాటొద్దు..బైక్‌పై చిన్నారులుంటే కంట్రోల్ కంపల్సరి
ఈ అరుదైన ఘటనలపై క్రిస్టిన్ మాట్లాడుతు..ఇలా జరుగుతుందని మేం అసలు ఊహించలేదు కానీ ఇది తమకు అత్యంత ప్రత్యేకం అంటూ తెగ ఆనంద పడిపోతుంటుంది. క్రిస్టిన్ భర్త మిన్నెసోటా యూనివర్శిటీలో సోషియాలజీ ప్రొఫెసర్ అయిన రాబ్ వారెన్ మాట్లాడుతూ…”ముగ్గురు ఆడపిల్లలు సంవత్సరాల తేడాతో జన్మిస్తారని అనుకున్నాం కానీ ఇలా ఒకే నెల ఒకే తేదిన జన్మిస్తారని అస్సలు ఊహించలేదు. పైగా అందుకోసం ఎటువంటి ప్లాన్‌ చేయలేదు అయినా ఇటువంటి అరుదైన అద్భుతమైన ఆడపిల్లలు మాకు పుట్టారని..వారి పుట్టిన రోజులు మాకు చాలా చాలా అపురూపమైనవి అని సంతోషంగా చెప్పాడు.