40 KM Speed Limit : స్పీడ్ 40 దాటొద్దు..బైక్‌పై చిన్నారులుంటే కంట్రోల్ కంపల్సరి

ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే చిన్నారుల భద్రతే లక్ష్యంగా కేంద్రం కొన్ని ప్రతిపాదనలను రూపొందించింది. చిన్నారులు భద్రతే లక్ష్యంగా 40 కిలోమీటర్ల వేగం మించరాదని సూచించింది.

40 KM Speed Limit : స్పీడ్ 40 దాటొద్దు..బైక్‌పై చిన్నారులుంటే కంట్రోల్ కంపల్సరి

40 Kmph Speed Limit For Motorcycles While Child

40 KMPH Speed Limit For Motorcycles While Child : బైక్ ఎక్కితే రయ్ మంటూ దూసుకెళ్లిపోతుంటాం. కొంతమంది అయితే వెనకాల ఆడవాళ్లు కూర్చున్నా..చిన్నపిల్లలు కూర్చున్నా సరే స్పీడ్ గా రయ్ అంటూ దూసుకెళ్లిపోతుంటారు. అలా చేస్తే పిల్లల సేఫ్టీ ఏమవుతుందో ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. పట్టుతప్పితే…జరగరానిది జరిగితే ఇక ఆ పై ఆలోచించటానికి కూడా ధైర్యం సరిపోదు. అందుకే ఎటువంటి అనర్ధాలు జరుగకూడదనే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం బైకుల మీద వెళ్లేటప్పుడు చిన్నారులు ఉంటే వేగం వద్దనే విషయంలో కొన్ని మార్గదర్శకాలు ప్రకటించింది.

ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే చిన్నారుల భద్రతే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలను రూపొందించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ పలు సూచనలు చేసింది. నాలుగేళ్లలోపు చిన్నారులు ప్రయాణించే మోటార్‌ బైక్‌ వేగం గంటకు 40 కిలోమీటర్లకు మించకూడదని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అలాగే అంతకంటే చంటిబిడ్డలతో ప్రయాణిస్తుంటే మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని తెలిపింది. దాంట్లో భాగంగానే 9 నెలల నుంచి 4 ఏళ్లలోపు చిన్నారులతో ప్రయాణిస్తుంటే.. తప్పని సరిగా హెల్మెట్‌ ఉండేలా వాహనదారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దాంతో పాటు..వాహనం నడిపే వ్యక్తి..బైక్ పై ఎక్కించుకున్న చిన్నారిని సేఫ్టీ పట్టీతో తన వీపునకు తగిలించుకోవాలని..ఇది చాలా ఇంపార్టెంట్ అని అలా చేస్తే చిన్నారి సురక్షితంగా ఉంటుందని తెలిపింది. దీనివల్ల, చిన్నారి మెడ, తలభాగాలకు పూర్తి రక్షణ కలుగుతుందని వివరించింది.

ఈ పట్టీ అవసరానికి అనుగుణంగా సరి చేసుకునేలా ఉండాలని..ఆ పట్టీ కనీసం 30 కిలోల బరువును మోయగలిగే నైలాన్‌తో ఆ పట్టీ తయారయినదై ఉండాలని స్పష్టం చేసింది. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే చిన్నారుల భద్రతే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలను రూపొందించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ వెల్లడిస్తు..దీనిపై ఇంకా సలహాలు, సూచనలతో పాటు అభ్యంతరాలు ఏమన్నా ఉంటే తెలియజేయాల్సిందిగా ప్రజలను కోరింది. ఈ ముసాయిదాపై వచ్చే 30 రోజుల పాటు సూచనలు మరియు అభ్యంతరాలను స్వీకరించడానికి మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉంది.

కాగా..ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తే వాహనం నడిపే వ్యక్తికి నా చిన్నారి బైక్ మీద ఉంది..కాబట్టి జాగ్రత్తగా వెళ్లాలని పట్టీ సూచిస్తున్నట్లుగా ఉంటుంది. కాబట్టి ప్రతీ ఒక్కరు తాము వాహనాలు నడిపేటప్పుడు తమ కుటుంబాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మనం ప్రతీ రోజు ఎన్నో ప్రమాదాలు చూస్తున్నాం. వింటున్నాం. ఆ ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.వారిలో అభం శుభం తెలియని చిన్నారులు కూడా ఉండటం బాధాకరం.