Crazy Business : వాడేసిన అండర్ వేర్లు అమ్ముతున్న ఎయిర్ హోస్టెస్..లక్షల్లో సంపాదన

ఎయిర్ హోస్టెస్ గా నెలకు రూ.2లక్షలకు పైగా సంపాదించే ఓ యువతి జాబుకు రిజైన్ చేసి అండర్ వేర్లు అమ్ముతోంది. ఎందుకంటే..అంతకంటే ఎక్కువ సంపాదన కోసమట..!!

Crazy Business : వాడేసిన అండర్ వేర్లు అమ్ముతున్న ఎయిర్ హోస్టెస్..లక్షల్లో సంపాదన

Air Hostess Used To Earn Money By Selling Her Underwear In Flight!

Viral News: అమ్మకానికి ఏదీ అనర్హం కాదు అన్నట్లుగా ముక్కు మూతి తుడుచుకుని పడేసిన టిష్యూ పేపర్లను కూడా లక్షల రూపాయాలకు అమ్మేసారు. అటువంటిది వాడేసిన అండర్ వేర్లు అమ్మితేతప్పేంటీ?అనుకుందో ఏమోగానీ ఓ మహిళ తను చేసే బ్రహ్మాండమైన ఎయిర్ హోస్టెస్ జాబు వదిలేసి వాడేసిన అండర్ వేర్లు అమ్ముతోంది. ఎయిర్ హోస్టెస్ గా పనిచేసినప్పుడు నెలకు రూ.2లక్షలకు పైగా వచ్చేవి. కానీ అండర్ వేర్ అమ్మకాలతో అంతకంటే ఎక్కువే సంపాదిస్తుండటం విశేషం. గతంలో కంటూ అండర్ వేర్ అమ్మకాలతో నెలకు దాదాపు రూ.3లకుపైగా సంపాదిస్తోంది. ఈ వింత వ్యాపారం గురించి విశేషాలేంటో చూసేద్దాం.

Read more : Engineers Thela : దమ్మున్న ఇంజనీర్ల దమ్ బిర్యానీ..ఓ వైపు ఉద్యోగం..మరోవైపు వ్యాపారం

జాస్మిన్ పింక్ అనే 26 ఏళ్ల అమ్మాయి ఎయిర్‌హోస్టెస్‌గా పని చేసేది. రెండేళ్లపాటు రోజుకు 12 గంటల పాటు పనిచేసేది. ఆమెకు బోర్ కొట్టిందో..ఇంతకంటే ఎక్కువ సంపాదించాలని అనుకుందో ఏమోగానీ జాబుకు రిజైన్ చేసింది. ఇంటర్నెట్‌లో ‘సోఫియా గ్రే’ అనే వెబ్‌సైట్‌లో చేరింది. అందులో వాడేసిన లో దుస్తులను అమ్ముకోవచ్చు. ఈ సైట్‌లో చేరిన జాస్మిన్. తన నిక్కర్ల (లో దుస్తులు) ను ప్రదర్శనకు పెట్టింది. వాటికి రేట్లు ఫిక్స్ చేసింది. ఎయిర్ హోస్టెస్‌గా నెలకు 2 లక్షలకు పైగా సంపాదించే ఆమె అండర్‌వేర్లు అమ్మి మరో లక్షన్నర అదనంగా సంపాదించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఈ వ్యాపారం మంచి లాభసాటిగా మారటంలో నెల నెలా 3 లక్షలు పైనే సంపాదించేది. దీనితో ఉద్యోగానికి రిజైన్‌ చేసి, నిక్కర్ల వ్యాపారంలో మునిగిపోయింది. ఇప్పుడామె ఫుల్ బిజీ. డబ్బులు సంపాదించటంలో కూడా ఫుల్ బిజీ అయిపోయింది.

గతం కంటే సంపాదన పెరిగిన జాస్మిన్ అక్కడితో ఆగలేదు.ఓన్లీ ఫ్యాన్స్ అనే అడల్ట్ సబ్‌స్క్రిప్షన్ వెబ్‌సైట్‌లో చేరింది. స్కిన్ షో కంటెంట్‌ను క్రియేట్ చేసింది. ఆ కంటెంట్ కావాలనుకున్న వారు… ఆమెకు డబ్బులిచ్చి కొనుక్కోవడం మొదలుపెట్టారు. అలా తనకంటూ కొంత మంది సబ్‌స్క్రైబర్లను సంపాదించుకుంది. ఆ తర్వాత వారికి తన సైడ్ బిజినెస్‌ గురించి చెప్పింది. అలా మరింత మంది ఆమె వాడిన పాత లో దుస్తులు, సాక్సులు, బట్టలు కొనడం ప్రారంభించారు.

Read more : Earnings with garbage : చెత్త ఏరుకుంటూ నెలకు రూ.3లక్షలు సంపాదిస్తు సెలబ్రిటీ అయిపోయింది

సోఫియా గ్రే సైట్‌లో వాడేసిన ఒక నిక్కర్ ధర 60 డాలర్లు.. అంటే 4,500 రూపాయలు. వాడేసిన ఒక బ్రా ధర 80 డాలర్లు అంటే 6000 వేల రూపాయలు. ఈ వ్యాపారంలో ఆమె మంచి పట్టు సాధించింది. ఇప్పుడు జాస్మిన్… అటు ఓన్లీ ఫ్యాన్స్ మెంబర్‌గా, ఇటు సోఫియా గ్రే వ్యాపారిగా రెండు చేతులా లక్షలు సంపాదించేస్తోంది. ఇలాంటి విచిత్రమైన వ్యాపారాలు ఇప్పటికీ కొన్ని దేశాల్లో మంచి హవాలో జరుగుతున్నాయి.