Engineers Thela : దమ్మున్న ఇంజనీర్ల దమ్ బిర్యానీ..ఓ వైపు ఉద్యోగం..మరోవైపు వ్యాపారం

ఓ పక్క ఉద్యోగం..మరోపక్క బిర్యానీ వ్యాపారంతో జీతంతో పాటు నెలకు లక్షల రూపాయాలు సంపాదిస్తున్న ఇద్దరు యువ ఇంజనీర్లు యువతకు ఆదర్శనంగా నిలుస్తున్నారు.

Engineers Thela : దమ్మున్న ఇంజనీర్ల దమ్ బిర్యానీ..ఓ వైపు ఉద్యోగం..మరోవైపు వ్యాపారం

Engineers Sell Biryani Earn (1)

youth Business Idea..Engineers Thela : ఇద్దరు ఇంజనీర్ కుర్రాళ్ల దమ్ బిర్యానీ బిజినెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉద్యోగాలు చేస్తునే బిర్యాని బిజినెస్ చేస్తు నెలకు రూ.2లకు పైగా సంపాదిస్తున్నారు. రుచికరమైన బిర్యానీ, చికెన్ టిక్కాల స్పెషాలిటీలతో చక్కటి సంపాదన అందుకుంటున్నారు సుమిత్ సమల్, ప్రియం బెబర్తా అనే ఇద్దరు ఇంజనీర్లు. ఒడిశాలోని మల్కన్ గిరిలోని పట్టణ కలెక్టర్ కార్యాలయం సమీపంలో వీధిలో ఫుడ్ కార్ట్ నిలుస్తుంది. రుచికరమైన బిర్యానీ, చికెన్ టిక్కా ఈ స్టాల్‌లో వెరీ స్పెషల్ . ఒక్కసారి తింటే వన్ మోర ప్లేట్ ప్లీజ్ అనేంత టేస్టు వాటివి. 2021 మార్చిలో రూ.50,000 పెట్టుబడితో మొదలు పెట్టారు. ఇప్పుడు నెలకు వారి పెట్టుబడి పోను..రూ.2లక్షలకుపైగా సంపాదిస్తున్నారు. మంచి క్వాలిటీతో పాటు క్వాంటిటీని కూడా మెయిన్ టెన్ చేస్తు వారి ఫుడ్ స్టాల్ కు ఓ స్పెషాలిటీ సంపాదించుకున్నారు. దీంతో మంచి గిరాకి ఉంటుంది.

Read more : 94 ఏళ్ల బామ్మ..ఆమే పేరే బ్రాండ్..స్టార్టప్ తో లక్షలు సంపాదన

సుమిత్ సమల్, ప్రియం బెబర్తా ఇద్దరు చిన్ననాటినుంచి స్నేహితులు.ఇద్దరు కార్పొరేట్ ఉద్యోగులే. ఇంజనీర్ థేలా అని పిలువబడే వారు సొంతంగా చిన్న సైడ్‌ వ్యాపారం చేసుకుంటున్నారు. వారిద్దరూ ప్రొఫెషనల్ ఇంజనీర్లు జీతంతో పాటు వారి హ్యాండ్‌కార్ట్ ద్వారా ప్రతి నెలా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఓ పక్క ఉద్యోగం చేస్తునే మరోపక్క ఈ బిర్యానీ బిజినెస్ కూడా చేస్తున్నారు.కోవిడ్ -19 వల్ల వచ్చిన లాక్ డౌన్ తో మూత పడిన ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ నే కొనసాగిస్తున్నారు. దీంతో ఈ ఇంజనీర్లు ఇద్దరు ఇంటినుంచే పనిచేస్తున్నారు. అలా ఇద్దరు తమ వర్క్ ఫినిష్ చేసుకున్న తరువాత ప్రతీ సాయంత్రం ఇద్దరూ కలిసి బయటకు వెళ్లి ఏదొకటి తినటం అలవాటు. అలా ఓరోజు బిర్యానీ తినడానికి వెళ్లారు. ఓ చోట బిర్యానీ తిందామని వెళ్లారు. కానీ అక్కడ పరిశుభ్రత సరిగా లేకపోవటం గమనించి అక్కడ తినకుండా వచ్చేశారు.

ఫుడ్ వ్యాపారం చేసే చోట పరిశుభ్రత లేకపోతే ఎలా? అని ఇద్దరు దాని గురించి మాట్లాడుకున్నారు. అలా మాట్లాడుకుంటున్నవారికి ఓ ఐడియా వచ్చింది. డ్యూటీ అయిపోయాక ఇలా రోడ్ల వెంట ఖాళీగా తిరుగుతు అక్కడ బాగాలేదు..ఇక్కడ బాగాలేదు అని అనుకునే కంటే మనమే ఓ ఫుడ్ బిజినెస్ పెట్టి మంచి క్వాలిటీని అందించవచ్చుకదా? అని ఐడియా వచ్చింది.అలా ఇద్దరు కలిసి రూ. 50 వేల పెట్టుబడితో బిర్యానీ వ్యాపారం మొదలుపెట్టారు. ఇద్దరు వంటవాళ్లను కూడా పెట్టుకున్నారు. రోజువారీ పని కోసం మల్కన్ గిరిలోని పట్టణ కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఒక రూమ్ రెంట్ కు తీసుకున్నారు. ఇంట్లో వండినట్లుగా చక్కటి నాణ్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దాంట్లో ఎటువంటి రాజా పడే ప్రసక్తే లేని ముందే నిర్ణయించుకున్నారు.

Read more : Colette Maze : 107 ఏళ్ల వయస్సులో పియానో ఆల్బమ్ రిలీజ్ చేసిన బామ్మ

ప్రతి సాయంత్రం వారి వర్క్ పూర్తి అయ్యాక బిర్యానీ వ్యాపారం పనిలో పడతారు. అలా హ్యాండ్‌కార్ట్‌ను తమ స్థలానికి తీసుకువస్తారు. ప్లేట్ చికెన్ బిర్యానీ రూ.120. సగం ప్లేట్ రూ.70. అలా చక్కటి క్వాలిటీతో పాటు చక్కటి రుచిని కూడా మెయిన్ టెన్ చేస్తు..రోజుకు దాదాపు రూ .8 వేలు సంపాదిస్తున్నారు. అంటే నెలకు దాదాపు రూ .2.5 లక్షల వరకూ సంపాదిస్తున్నారు.బిర్యానీతో పాటు చికెన్ టిక్కాలు కూడా వీరి ప్రత్యేక డిష్. ఇద్దరు కలిసి వ్యాపారానికి కావాల్సిన సరుకులు కొనుక్కొస్తారు. నాణ్యత కోసం వంట సమయంలో వారిద్దరు దగ్గరే ఉండి వండిస్తారు.

Read more : హ్యాట్సాఫ్ అమ్మలూ : లద్ధాఖ్ సరిహద్దుల్లో సైనికుల ఆకలి తీర్చటానికి గడ్డకట్టే చలిలో మహిళల డ్యూటీ..

తమ వ్యాపారం గురించి ప్రియం మాట్లాడుతు..మేం ఇద్దరం చెఫ్ లం కాదు. కానీ మా అమ్మలు ఇంట్లో బిర్యానీ చేసేసమయంలో వారికి హెల్ప్ చేస్తూ దగ్గరుండి చూసేవాళ్లం..ఇంట్లో మనం ఎంత పరిశుభ్రంగా వండుకుంటామో అంటువంటి పరిశుభ్రత కలిగిన రుచికరమైన బిర్యానీ అందించటమే మా లక్ష్యం అలా మా వర్క్ పూర్తి అయ్యాక బిర్యానీ వ్యాపారం చేస్తాం అని తెలిపారు.