Six Planet Parade: అరుదైన ఖగోళ దృశ్యం..! 6 గ్రహాల పరేడ్.. ప్రత్యేకత ఏంటి, కంటికి కనిపిస్తుందా?

తదుపరి ప్రధాన గ్రహ కవాతు అక్టోబర్ 2028 లో జరుగుతుంది. ఆ సమయంలో ఐదు గ్రహాలు తెల్లవారుజామున ఆకాశంలో కలిసి కనిపిస్తాయని భావిస్తున్నారు.

Six Planet Parade: ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్కైవాచర్లు ఆగస్టు 19( మంగళవారం) అరుదైన ఖగోళ దృశ్యాన్ని వీక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. బుధుడు శుక్రుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్‌లతో కలిసి ఆరు గ్రహాల ‘కవాతు’గా ఖగోళ శాస్త్రవేత్తలు అభివర్ణిస్తారు.

నివేదిక ప్రకారం తూర్పున ఆకాశంలో సూర్యోదయానికి ఒక గంట ముందు బుధుడు దాని పశ్చిమానికి చేరుకున్నప్పుడు ఈ దృశ్యం బాగా కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఆరు గ్రహాల కవాతు: ప్రత్యేకత ఏమిటి..

ఆగస్టులో జరిగే ఆరు గ్రహాల పరేడ్ స్కై వాచర్లలో ఉత్సాహం పెంచింది. నాలుగు ప్రకాశవంతమైన గ్రహాలు.. శుక్రుడు, బృహస్పతి, శని, బుధుడు కంటికి కనిపిస్తాయి. యురేనస్, నెప్ట్యూన్‌లకు టెలిస్కోప్‌లు అవసరం.

మంగళవారం ఉదయం 16శాతం కాంతితో చంద్రుడు ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు, అతిపెద్ద గ్రహం బృహస్పతి పైన ప్రకాశిస్తాడు. వాటి కింద బుధుడు ఉంటాడు. అదే సమయంలో శని దక్షిణ ఆకాశం వైపు కనిపిస్తుంది.

ఖగోళ శాస్త్రవేత్తలు ఈ “గ్రహాల అమరికని” ఒక ఆప్టికల్ భ్రమగా అభివర్ణిస్తున్నారు.

గ్రహాలు ఒకదానికొకటి లేదా భూమికి భౌతికంగా దగ్గరగా లేవు. బదులుగా, అవన్నీ ఆకాశంలో ఒకే కర్వ్డ్ పాత్ లో కనిపిస్తాయి.

దీనిని ఎక్లిప్టిక్ అని పిలుస్తారు. ఇది సౌర వ్యవస్థ ప్లేన్. ఇక్కడ అన్ని గ్రహాల కక్ష్యలు దాదాపుగా ఉంటాయి.

ఆరు గ్రహాల కవాతు: అంతరిక్షంలో దూరాలు..

ఈ కవాతు గ్రహాల సమూహంలా కనిపించినప్పటికీ, వాటిని వేరు చేసే వాస్తవ దూరాలు చాలా పెద్దవి. ఆగస్టు 19న, బుధుడు భూమి నుండి దాదాపు 80 మిలియన్ మైళ్ళు (128 మిలియన్ కిలోమీటర్లు), శుక్రుడు దాదాపు 118 మిలియన్ మైళ్ళు (190 మిలియన్ కిలోమీటర్లు), బృహస్పతి 548 మిలియన్ మైళ్ళు (882 మిలియన్ కిలోమీటర్లు), శని దాదాపు 888 మిలియన్ మైళ్ళు (1,430 మిలియన్ కిలోమీటర్లు) దూరంలో ఉంటాయి.

సాంకేతికంగా ఈ కవాతులో భాగమైన యురేనస్, నెప్ట్యూన్ కంటికి కనిపించవు. వాటిని టెలిస్కోప్‌ల ద్వారా మాత్రమే గమనించవచ్చు.

ఆరు గ్రహాల పరేడ్.. ఎందుకు ముఖ్యమైనది?

ఆగస్టులో జరిగే ఆరు గ్రహాల కవాతు ఖగోళశాస్త్రంపై ప్రజల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇటువంటి సంఘటనలు అంతరిక్షం గురించి ఉత్సుకతను రేకెత్తించడమే కాకుండా, జనాదరణ పొందిన అపోహలు, శాస్త్రీయ వాస్తవాల మధ్య తేడాను గుర్తించడంలో కూడా సహాయపడతాయని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. (Six Planet Parade)

ఉదాహరణకు, “అమరిక” అనే పదం తప్పుదారి పట్టించేది. ఎందుకంటే గ్రహాలు వందల మిలియన్ల మైళ్లతో వేరు చేయబడ్డాయి. ఎప్పుడూ సరళ రేఖలో ఉండవు.

అరుదైన ఖగోళ అవకాశం..
సాధారణ నక్షత్రాలను చూసే వారికి, మంగళవారం జరిగే ఆరు గ్రహాల కవాతు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. ఉల్కాపాతాలు లేదా గ్రహణాలు కాకుండా,

ఈ కవాతు తెల్లవారుజామున క్రమంగా ఉంటుంది. యురేనస్, నెప్ట్యూన్ కోసం టెలిస్కోప్ కావాలి. ప్రత్యేక పరికరాలు అవసరం లేదు.

ఆగస్టు 19న జరిగే ఆరు గ్రహాల కవాతు ఏమిటి?
ఆరు గ్రహాల కవాతు అనేది ఒక విజువల్ ఫినామిన్. దీనిలో బుధుడు(మెర్కురీ), శుక్రుడు(వీనస్), బృహస్పతి(జుపిటర్), శని(సాటర్న్), యురేనస్ , నెప్ట్యూన్ ఆకాశంలో ఒకే కర్వ్డ్ లైన్ లో కనిపిస్తాయి. దీనిని ఎక్లిప్టిక్ అని పిలుస్తారు.

వాటిలో నాలుగు – బుధుడు, శుక్రుడు, బృహస్పతి శని గ్రహాలను టెలిస్కోప్ లేకుండా చూడొచ్చు, యురేనస్, నెప్ట్యూన్‌లకు మాగ్నిఫికేషన్ అవసరం.

తదుపరి ప్రధాన గ్రహ కవాతు అక్టోబర్ 2028 లో జరుగుతుంది. ఆ సమయంలో ఐదు గ్రహాలు తెల్లవారుజామున ఆకాశంలో కలిసి కనిపిస్తాయని భావిస్తున్నారు.

Also Read: ఓమైగాడ్.. బ్రెయిన్ తినేస్తున్న అమీబా.. ఆల్రెడీ 9 ఏళ్ల బాలిక మృతి.. ఏంటీ అమీబా? ఎలా వస్తుంది?