Brain Eating Amoeba: ఓమైగాడ్.. బ్రెయిన్ తినేస్తున్న అమీబా.. ఆల్రెడీ 9 ఏళ్ల బాలిక మృతి.. ఏంటీ అమీబా? ఎలా వస్తుంది?
బాలిక మరణానికి అమీబిక్ ఎన్సెఫాలిటిస్ కారణంగా గుర్తించారు. కాగా, కోజికోడ్ లో ఈ తరహా మరణాలలో ఇది నాల్గవ కేసు. (Brain Eating Amoeba)

Brain Eating Amoeba: ఉత్తర కేరళలో రెండు రోజుల క్రితం తొమ్మిదేళ్ల బాలిక మరణించింది. ఆమె మరణానికి కారణం అమీబిక్ ఎన్సెఫాలిటిస్ అని ఆరోగ్య అధికారులు నిర్ధారించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. బాలిక మరణం స్థానికులను ఆందోళనకు గురి చేసింది.
అసలేంటీ..అమీబిక్ ఎన్సెఫాలిటిస్.. ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, లక్షణాలు ఏంటి, మరణం ఎందుకు సంభవిస్తుంది?
అమీబిక్ ఎన్సెఫాలిటిస్.. ఇది అరుదైన మెదడు ఇన్ఫెక్షన్. ఆగస్ట్ 13న ఆ బాలిక జ్వరం బారిన పడింది. చూస్తుండగానే.. ఆమె ఆరోగ్య పరిస్థితి వేగంగా క్షీణించింది. ఆగస్టు 14న బాలికను కోజికోడ్ వైద్య కళాశాలకు తరలించారు. అదే రోజు బాలిక చనిపోయింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బాలికకు చెరువు లేదా సరస్సు వంటి నీటి వనరు నుండి ఇన్ఫెక్షన్ సోకింది. అధికారులు ఇప్పుడు ఆ నీటి కోసం వెతుకుతున్నారు.
బాలిక మరణానికి అమీబిక్ ఎన్సెఫాలిటిస్ కారణంగా గుర్తించారు. కాగా, కోజికోడ్ లో ఈ తరహా మరణాలలో ఇది నాల్గవ కేసు. (Brain Eating Amoeba)
అమీబిక్ ఎన్సెఫాలిటిస్ లేదా మెదడును తినే అమీబా అంటే ఏమిటి?
అమీబిక్ ఎన్సెఫాలిటిస్ అనేది మెదడు ఇన్ఫెక్షన్. ఇది N ఫౌలేరి అమీబా బారిన పడినప్పుడు వస్తుంది. ఈ సూక్ష్మ జీవి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. అయితే, N ఫౌలేరి బారిన పడటం వలన ప్రాథమిక అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ వస్తుంది. ఇది మెదడు తీవ్రమైన ఇన్ఫెక్షన్.
అమీబిక్ ఎన్సెఫాలిటిస్ అనేది పర్యావరణ అమీబా. ఇది “మెదడును తినే అమీబా” అని పిలవబడే వ్యాధికి కారణమవుతుంది.
అమీబిక్ ఎన్సెఫాలిటిస్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన నీటి ద్వారా సంక్రమించే సూక్ష్మజీవులలో ఒకటి.
మెదడును తినే అమీబా అనేది ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్. సరస్సులు, నదులు, ప్రవాహాలు వంటి మంచి నీటి వనరుల ద్వారా కాంటాక్ట్ లోకి రావచ్చు. ఈ జీవులు ప్రధానంగా 25 నుంచి 40°C మధ్య ఉష్ణోగ్రతలు కలిగిన వెచ్చని నీటిలో నివసిస్తాయి.(Brain Eating Amoeba)
బ్రెయిన్-ఈటింగ్ అమీబా లక్షణాలు ఏమిటి?
బ్రెయిన్-ఈటింగ్ అమీబా లక్షణాలు
* గొంతు నొప్పి
* తలనొప్పి
* మతి భ్రమణము
* గందరగోళం
* వాంతులు
* జ్వరం
* మెడ దృఢత్వంలో మార్పులు
* రుచి వాసనలో మార్పులు
* మూర్ఛ
* ఎవరైనా ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ బారిన పడితే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఇన్ఫెక్షన్ మధ్య లక్షణాలు కనిపించే వరకు సమయం, తరచుగా 3 నుండి 7 రోజుల వరకు ఉంటుంది. (Brain Eating Amoeba)
చాలా సందర్భాలలో రోగికి త్వరిత వైద్య సాయం అందించినప్పటికీ ఈ ఇన్ఫెక్షన్ ఎల్లప్పుడూ మరణానికి దారితీస్తుంది. ఈ సందర్భాలలో లక్షణాలు ప్రారంభమైన 5 రోజుల తర్వాత మరణం సంభవిస్తుంది.
Also Read: జస్ట్ నెల రోజుల్లో.. 18 కిలోల బరువు తగ్గిన సింగర్.. ఇదెలా సాధ్యమైంది.. సీక్రెట్ ఏంటి..