Small Plane Crash : పోలాండులో కుప్పకూలిన చిన్న విమానం..ఐదుగురి మృతి

పోలాండు దేశంలో చిన్న విమానం కుప్పకూలిపోయింది. పోలాండు దేశంలోని వార్సా సమీపంలోని ఎయిర్‌ఫీల్డ్ వద్ద చిన్న విమానం హ్యాంగర్‌లోకి దూసుకెళ్లి ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు....

Small Plane Crash

Small Plane Crash : పోలాండు దేశంలో చిన్న విమానం కుప్పకూలిపోయింది. పోలాండు దేశంలోని వార్సా సమీపంలోని ఎయిర్‌ఫీల్డ్ వద్ద చిన్న విమానం హ్యాంగర్‌లోకి దూసుకెళ్లి ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. (Small Plane Crashes In Poland) ఈ ఘటనలో కనీసం ఏడుగురు గాయపడ్డారని పోలాండ్ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఆడమ్ నీడ్జిల్స్కీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Asia Cup 2023 : వారంలో ఆసియా క‌ప్ షెడ్యూల్‌.. ఆరంభ మ్యాచ్ ఎక్క‌డంటే..?

వార్సా నుంచి 47 కిలోమీటర్లు దూరంలో ఉన్న క్రిసిన్నో గ్రామంలో విమాన ప్రమాదం జరిగిన ప్రదేశానికి నాలుగు హెలికాప్టర్లు, 10 అంబులెన్స్‌లను పంపించినట్లు నీడ్జీల్స్కీ చెప్పారు. క్రిసినోలోని ఎయిర్‌ఫీల్డ్‌లో ఈ సంఘటన జరిగిందని, విమానం యొక్క తోక హ్యాంగర్‌లో నుంచి బయటకు వచ్చినట్లు చూపించే ఫోటోను స్థానిక అగ్నిమాపక విభాగం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. కుప్పకూలిన విమానం సెస్నా 208 అని పోలాండ్ మీడియా పేర్కొంది.