Asia Cup 2023 : వారంలో ఆసియా క‌ప్ షెడ్యూల్‌.. ఆరంభ మ్యాచ్ ఎక్క‌డంటే..?

ఆసియా క‌ప్ షెడ్యూల్ ఎప్పుడు వ‌స్తుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అదిగో ఇదిగో అంటున్నారే త‌ప్ప ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. ఎట్ట‌కేల‌కు దీనికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) క్లారిటీ ఇచ్చింది

Asia Cup 2023 : వారంలో ఆసియా క‌ప్ షెడ్యూల్‌.. ఆరంభ మ్యాచ్ ఎక్క‌డంటే..?

Asia Cup 2023

Asia Cup 2023 schedule : ఆసియా క‌ప్ షెడ్యూల్ ఎప్పుడు వ‌స్తుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అదిగో ఇదిగో అంటున్నారే త‌ప్ప ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. ఎట్ట‌కేల‌కు దీనికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) క్లారిటీ ఇచ్చింది. ఈ వారంలోనే ఆసియా క‌ప్ షెడ్యూల్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఆగ‌స్టు 31 నుంచి సెప్టెంబ‌ర్ 17 వ‌ర‌కు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. జూలై 15న దుబాయ్‌లో ఆసియా క్రికెట్ కౌన్సిల్‌(Asian Cricket Council), పీసీబీ అధికారుల మ‌ధ్య స‌మావేశం జ‌రిగింది.

Babar Azam : అయ్యో.. ఆజాము..! సెంచ‌రీ ఎక్క‌డ‌.. ఇంకో 87 ప‌రుగులు చేసుంటేనా..?

ఇందులో ఆసియా క‌ప్ షెడ్యూల్‌పై తుది నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా టోర్నీ నిర్వ‌హ‌ణ‌, మార్కెటింగ్‌, క్యాంపెయిన్ వంటి అంశాల గురించి కూడా చ‌ర్చించిన‌ట్లు పీసీబీ తెలిపింది. ప్రారంభ మ్యాచ్‌ను పాకిస్తాన్‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

హెబ్రిడ్ మోడ్‌లోనే..!

భార‌త జ‌ట్టు ఎట్టి ప‌రిస్థితుల్లో పాకిస్తాన్‌లో ప‌ర్య‌టించే అవ‌కాశం లేద‌ని బీసీసీఐ తేల్చి చెప్ప‌డంతో పాకిస్తాన్ అతిథ్య మివ్వ‌నున్న ఆసియా క‌ప్‌ను హైబ్రిడ్ మోడ్‌లో నిర్వ‌హించ‌నున్నారు. దీని ప్ర‌కారం పాకిస్తాన్‌ నాలుగు మ్యాచ్‌లకు, శ్రీలంక‌లో తొమ్మిది మ్యాచ్‌ల‌కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది. టీమ్ఇండియా, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్గానిస్తాన్‌లు ఆసియా క‌ప్ కోసం పోటీప‌డ‌నున్నాయి.

Carlos Alcaraz : వింబుల్డన్ 2023 ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ గ‌ర్ల్‌ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..?

ఈ ఏడాది భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఉన్న నేప‌థ్యంలో ఆసియా క‌ప్‌ను స‌న్నాహాకంగా ఉప‌యోగించుకోనున్నారు. దీంతో ఆసియా క‌ప్ టోర్నీని వ‌న్డే ఫార్మాట్‌లోనే నిర్వ‌హించ‌నున్నారు. టీమ్ఇండియా, పాకిస్తాన్‌, నేపాలు ఒక గ్రూప్‌లో ఉండ‌గా, శ్రీలంక‌, బంగ్లాదేశ్, ఆప్గానిస్తాన్‌లు మ‌రో గ్రూపులో ఉన్నాయి. ప్ర‌తి గ్రూప్ నుంచి టాప్ 2 జ‌ట్లు సూప‌ర్ 4 ద‌శ‌కు అర్హ‌త సాధిస్తాయి. గ‌త‌సారి టీ20 ఫార్మాట్‌లో నిర్వ‌హించిన ఆసియా క‌ప్‌లో శ్రీలంక విజేత‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే.