Carlos Alcaraz : వింబుల్డన్ 2023 ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ గ‌ర్ల్‌ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..?

నొవాక్ జొకోవిచ్‌ను ఓడించి వింబుల్డ‌న్ విజేత‌గా నిలిచిన స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) పేరు టెన్నిస్ ప్ర‌పంచంలో మారుమోగిపోతుంది. ఈ కొత్త ఛాంపియ‌న్‌కు సంబంధించిన వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను తెలుసుకునే ప‌నిలో ఉన్నారు.

Carlos Alcaraz : వింబుల్డన్ 2023 ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ గ‌ర్ల్‌ఫ్రెండ్ ఎవ‌రో తెలుసా..?

Carlos Alcaraz- Maria Gonzalez

Updated On : July 17, 2023 / 8:15 PM IST

Carlos Alcaraz- Maria Gonzalez : సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడంతో పాటు వారి వృత్తిపరమైన జీవితం గురించి కూడా తెలుసుకోవాలనే ఆసక్తిని చాలా మందిలో ఉంటుంది. నొవాక్ జొకోవిచ్‌ను ఓడించి వింబుల్డ‌న్ విజేత‌గా నిలిచిన స్పెయిన్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz) పేరు టెన్నిస్ ప్ర‌పంచంలో మారుమోగిపోతుంది. ఈ కొత్త ఛాంపియ‌న్‌కు సంబంధించిన వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను తెలుసుకునే ప‌నిలో ఉన్నారు నెటీజ‌న్లు. అయితే.. ఇత‌డు త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను పంచుకునేందుకు పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌డు.

Wimbledon 2023: వింబుల్డన్ విజేత అల్కరాజ్.. మీడియా ముందు కంటతడి పెట్టిన జొకోవిచ్

ముర్సికా ప‌ట్ట‌ణానికి చెందిన కార్లోస్ అదే ప‌ట్ట‌ణానికి చెందిన మరియా గొంజాలెజ్ గిమెనెజ్‌(Maria González Giménez) అనే భామ‌తో డేటింగ్‌లో ఉన్నాడ‌ని తెలుస్తోంది. ఆమె కూడా ఒక ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ కావ‌డం విశేషం. స్పెయిన్‌లో పుట్టి పెరిగిన ఆమె ముర్సియా క్ల‌బ్ డి టెన్నిస్ అనే క్ల‌బ్ కోసం టెన్నిస్ ఆడుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఇద్ద‌రూ త‌మ మ‌ధ్య సంబంధాన్ని బ‌హిరంగంగా ఎక్క‌డా వెల్ల‌డించ‌లేదు. అయితే.. కార్లోస్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ ఈ వార్త‌ల‌కు బ‌లాన్ని చేకూరుస్తోంది. అభిమానులు మాత్రం వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌ని ఫిక్స్ అయిపోయారు. వీరిద్ద‌రు త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనున్నారు అనే వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by MARIA GONZALEZ (@mariaaagimenezz)

Virat Kohli : ధోని ని అధిగ‌మించిన కోహ్లి.. స‌చిన్ రికార్డు పై క‌న్ను.. మ‌రో మైలురాయికి చేరువ‌

20 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్ వింబుల్డ‌న్‌కు ముందు 2022 యూఎస్ ఓపెన్ స‌హా 11 ఏటీపీ టూర్ టైటిళ్లు గెలిచాడు. ఇందులో నాలుగు మాస్ట‌ర్స్ 1000 టైటిళ్లు ఉన్నాయి. పీట్ సంప్రాస్ త‌రువాత యూఎస్ ఓపెన్ గెలిచిన పిన్న వ‌య‌స్సు ఆట‌గాడూ ఇత‌డే.

 

View this post on Instagram

 

A post shared by MARIA GONZALEZ (@mariaaagimenezz)