California airport : కాలిఫోర్నియాలో హ్యాంగర్‌ను ఢీకొన్న చిన్న విమానం…ముగ్గురి మృతి

కాలిఫోర్నియాలో జరిగిన విమాన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. దక్షిణ కాలిఫోర్నియా విమానాశ్రయంలో సింగిల్ ఇంజిన్ విమానం హ్యాంగర్‌లోకి దూసుకెళ్లి మంటలు చెలరేగడంతో పైలట్, ఇద్దరు ప్రయాణికులు మరణించారని విమానాశ్రయ అధికారులు తెలిపారు....

Small plane hits hangar : కాలిఫోర్నియాలో జరిగిన విమాన ప్రమాదంలో ముగ్గురు మరణించారు. దక్షిణ కాలిఫోర్నియా విమానాశ్రయంలో సింగిల్ ఇంజిన్ విమానం హ్యాంగర్‌లోకి దూసుకెళ్లి మంటలు చెలరేగడంతో పైలట్, ఇద్దరు ప్రయాణికులు మరణించారని విమానాశ్రయ అధికారులు తెలిపారు. (Small plane hits hangar)

PM Modi : ప్రధాని మోదీపై లాలూ సంచలన వ్యాఖ్యలు

ముగ్గురు వ్యక్తులతో ఉన్న బీచ్‌క్రాఫ్ట్ పి35 విమానం ఉదయం 6:30 గంటలకు అప్‌ల్యాండ్‌లోని కేబుల్ ఎయిర్‌పోర్ట్‌లో బయలుదేరే సమయంలో కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది. (catches fire at Southern California airport) శాన్ బెర్నార్డినో కౌంటీ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. (catches fire) పైలట్, ఇద్దరు ప్రయాణికులు సంఘటనా స్థలంలో మరణించినట్లు ప్రకటించారు.

Air India flight : ఎయిర్ ఇండియా విమానం మెడికల్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

డౌన్‌టౌన్ లాస్ ఏంజిల్స్‌కు తూర్పున 65 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగిందని అప్‌ల్యాండ్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రమాదంతో హ్యాంగర్‌కు ఓ మోస్తరు నష్టం వాటిల్లిందని, ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. ఈ విమాన ప్రమాదంపై ఎఫ్ఏఏ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ దర్యాప్తు చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు