Tearful Incident : క్యాన్సర్‌తో పోరాడుతున్న తల్లి సంతోషం కోసం కొడుకు.. అతని స్నేహితులు ఏం చేశారంటే…

క్యాన్సర్‌తో పోరాడేవారికి చికిత్స ఎంత అవసరమో? వారికి కుటుంబసభ్యులు అందించే సహకారం కూడా మరింత అవసరం. తల్లి క్యాన్సర్‌తో పోరాడుతుంటే ఆమెకు సంతోషాన్ని పంచడం కోసం ఆమె కొడుకు అతని స్నేహితులు ఏం చేసారో తెలిస్తే కన్నీరు వస్తుంది.

Viral News :  తల్లి క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతోంది. ఆ పరిస్థితులతో ఉన్న తల్లికి కొడుకు వెన్నుదన్నుగా నిలిచాడు. ఆమె ముఖంలో సంతోషం చూడటం కోసం అతను అతని స్నేహితులు చేసిన పని చూస్తే కన్నీరు తెప్పిస్తుంది.

Viral Video: బుడ్డోడు భలే పనిమంతుడు.. క్యాన్లు మోస్తూ తల్లికి అండగా చిన్నారి.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు ..

సెలూన్‌లో బార్బర్‌గా పనిచేసే ఓ కుర్రాడు క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న తల్లికి జుట్టు షేవ్ చేస్తుంటాడు. ఆ సమయంలో తల్లి చాలా ఎమోషనల్ అవుతుంది. తల్లి బాధని గమనించిన కొడుకు రేజర్‌తో తన జుట్టుని షేవ్ చేసుకుంటాడు. తరువాత అతనితో పనిచేసే స్నేహితులు కూడా వరుసగా తమ జుట్టుని షేవ్ చేసుకుని ఆ తల్లికి మద్దతుగా నిలుస్తారు. క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమెకు మనోబలం చేకూర్చడానికి వారు చేసిన పని చూస్తే మనసుని కదిలిస్తుంది.

Viral video: పదవీ విరమణ చేసే ముందు ఆర్మీ దుస్తుల్లో చివరిసారిగా తల్లికి సెల్యూట్

@GoodNewsMVT అనే ట్విట్టర్ యూజర్ ద్వారా ఈ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో అందరి మనసుల్ని కదిలించింది. ‘అందమైన మనసులు’ అని ఒకరు.. ‘ ఆ తల్లికి ప్రేమ అనే వైద్యాన్ని అందిస్తున్న వీరిని చూసి నాకు కన్నీరు వస్తోందని మరొకరు.. మాటలు రావట్లేదు’ అని మరికొందరు తమ అభిప్రాయాలు వెల్లడించారు. క్యాన్సర్ ను జయించాలంటే సమయానికి గుర్తించి అందుకు తగిన చికిత్స చేయించుకోవడంతో పాటు.. ఇలా కుటుంబసభ్యులు, స్నేహితులు ఇచ్చే మనో ధైర్యం వారికి మళ్లీ కొత్త జీవితాన్ని ఇస్తుంది. తల్లికి ఆ కొడుకు అతని స్నేహితులు ఇచ్చిన మద్దతుకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు