Viral video: పదవీ విరమణ చేసే ముందు ఆర్మీ దుస్తుల్లో చివరిసారిగా తల్లికి సెల్యూట్

పదవీ విరమణ చేసే ముందు ఆర్మీ దుస్తుల్లో చివరిసారిగా తల్లికి సెల్యూట్ చేశారు ఓ సైనిక అధికారి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తనను కని, పెంచి, ఆర్మీ అధికారిని చేసిన తల్లికి ఉద్యోగం ఉన్న సమయంలో చివరి సెల్యూట్ చేయాలని భావించి ఈ పని చేశారు ఆ అధికారి. మేజర్ జనరల్ రంజన్ మహాజన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు.

Viral video: పదవీ విరమణ చేసే ముందు ఆర్మీ దుస్తుల్లో చివరిసారిగా తల్లికి సెల్యూట్

Viral video

Viral video: పదవీ విరమణ చేసే ముందు ఆర్మీ దుస్తుల్లో చివరిసారిగా తల్లికి సెల్యూట్ చేశారు ఓ సైనిక అధికారి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తనను కని, పెంచి, ఆర్మీ అధికారిని చేసిన తల్లికి ఉద్యోగం ఉన్న సమయంలో చివరి సెల్యూట్ చేయాలని భావించి ఈ పని చేశారు ఆ అధికారి. మేజర్ జనరల్ రంజన్ మహాజన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు.

మొదటి ఇంటి బెల్ మోగించిన ఆర్మీ అధికారి, అనంతరం తలుపు తెరుచుకుని ఇంట్లోకి వెళ్లారు. సోఫాపై కూర్చున్న తన తల్లికి సెల్యూట్ చేశారు. ఆ సమయంలో ఆమె నిలబడింది. ఆ తర్వాత తల్లిని ఆ అధికారి ఆలింగనం చేసుకున్నారు. చిన్ననాటి నుంచి తన బాగోగులు చూసుకుంటూ, తనను పెంచిన తల్లికి తాను పదవీ విరమణ చేస్తున్నానని చెప్పారు.

ఆ వీడియో చూసి కన్నీరు తిరిగాయని పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. చిన్ననాటి నుంచి ఏ కొరతా లేకుండా చూసుకున్న తల్లిని, పెద్దయ్యాక కుమారులు కూడా అదే విధంగా చూసుకోవాల్సి ఉంటుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అమ్మకి సరైన రీతిలో కృతజ్ఞతలు చెప్పారని ఆ ఆర్మీ అధికారిని పలువురు అభినందించారు.

 

View this post on Instagram

 

A post shared by Smiley (@iranjanmahajan)

JDS: ఎన్ని లోన్లైనా తీసుకోండి, మేం అధికారంలోకి రాగానే అన్నీ మాఫీ చేస్తాం.. ఓటర్లకు జేడీఎస్ హామీ