Borana tribe : గుండు గీయించుకుంటేనే మంచి భర్త వస్తాడట

మంచి భర్త రావాలంటే గుండు చేయించుకోవలట. ఆడపిల్ల పుట్టాక పెరిగి పెద్ద అయ్యేవరకు మత్రమే జుట్టు పెంచుకోవాలి. పెళ్లీడు వస్తే జుట్టు కట్ చేయాల్సిందే. అలా అయితేనే మంచి భర్త వస్తాడనినమ్మకం

Borana tribe Strange custom : ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంప్రదాయాలు, మరెన్నో ఆచారాలు, ఇంకెన్నో నమ్మకాలు.ముఖ్యంగా పెళ్లి విషయంలో వారి వారి ఆనవాయితీలనుబట్టి చేస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈనాటికి కొనసాగే ఈ వింత ఆచారాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అటువంటి ఓ నమ్మకం మనకు వింతగా అనిపిస్తుంది. అదేమంటే మంచి భర్త రావాలంటే గుండు గీయించుకోవాలట. జుట్టు లేకపోతే అందమే ఉండదు. అటువంటిది మంచి భర్త కోసం గుండు గీయించుకోవటమేంటో ఆ ఆచారంలో ఉండే నమ్మకం ఏంటో తెలుసుకుందాం…

పెళ్లి అనగానే ఎక్కువ ప్రాధాన్యత అలంకరణకే ఇస్తారు. ముఖ్యంగా హెయిర్ స్టైల్. పొడవాటి జుట్టు ఉండాలని ప్రతీ మహిళ కోరుకుంటుంది. జుట్టు అంటే అంత ఇష్టం ఆడవారికి. పొడవాటి జుట్టు కోసం ఎన్నో పాట్లు పడతారు. జుట్టుని సంరక్షించుకోవటానికి ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటారు. అంత జాగ్రత్తగా చూసుకునే జుట్టును పెళ్లి కోసం కత్తిరించుకుంటారా ఎవరైనా? అస్సలు చేయరు.

Read more :Divorced Month : ఆ నెలలో పెళ్లి చేసుకుంటే విడిపోతారట..కలిసున్నా పిల్లలు పుట్టరట..

కానీ కొన్ని ఇష్టాల కంటే నమ్మకాలకు..ఆచారాలకే ప్రాధాన్యతనిస్తారు కొన్ని తెగలవారు. అటువంటి తెగే దక్షిణాఫ్రికాకు చెందిన బోరానా తెగ.దక్షిణాఫ్రికాకు చెందిన కొన్ని తెగల్లో ఆడవాళ్లు పెళ్లి తర్వత జుట్టు పెంచడానికి వీల్లేదు. వివాహానికి ముందే కత్తిరించేసుకోవాలి. ఒకరకంగా చెప్పాలంటే మొత్తం గుండు చేయించుకోవాలి.

బొరానా తెగ వింత ఆచారం
దక్షిణాఫ్రికాలోని ఇథోపియా, సోమాలియా దేశాల్లో స్థిరపడిన బొరానా తెగ ప్రజల్లో ఈ వింత ఆచారం ఉంది. ఈ తెగ ప్రజలు మొత్తం 500 మంది ఉంటారు. పితృస్వామ్య వ్యవస్థ. సాధారణంగా గిరిజన తెగల్లో మాతృస్వామ్య వ్యవస్థ ఉంటుంది. నిర్ణయాధికారాలు వారివే ఉంటాయి. కానీ బోరానా తెగ మాత్రం దీనికి విరుద్ధం. వీరిది పితృస్వామ్య వ్యవస్థ. దీంతో పురుషులదే అన్నింటా ఆధిక్యంగా ఉంటారు. గ్రామం, జంతువులు, పరివారం బాధ్యతలన్నింటిని పురుషులే చూసుకుంటారు. ఆడవారు కేవలం ఇంటిని అలంకరించడం.. సంప్రదాయాలను పాటించడం మాత్రమే చేయాలి.

Read more : వింత ఆచారం : పెళ్లి కూతురిపై ఉమ్మివేయడం..అదే ఆశీర్వాదమట

మంచి భర్త రావాలంటే జుట్టు కత్తిరిచాల్సిందే..
ఈ బోరానా తెగలో వింత ఆచారం భలే వింతగా అనిపిస్తుంది. పెళ్లికి ముందు వరకు మాత్రమే ఆడపిల్లలకు జుట్టు పెంచుకుంటారు. పెళ్లి ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయంటే.. ఇకఅమ్మాయిలు వారి జుట్టుపై ఆశ వదులుకోవాల్సిందే. నెత్తీ నోరు బాదుకున్నా జుట్టు మొత్తం కట్ చేసిపారేస్తారు. ఎందుకంటే మంచి భర్త కోసం ఇలా చేయక తప్పదంటారు బోరానా మహిళలు. జుట్టు కట్ చేసుకుంటేనే మంచి భర్త వస్తాడని నమ్మకం. ఒక వేళ జుట్టు ఏదో నామ మాత్రంగా కట్ చేసుకుంటే మంచి భర్త రాడని వారి నమ్మకం.

Read more :Divorced Month : ఆ నెలలో పెళ్లి చేసుకుంటే విడిపోతారట..కలిసున్నా పిల్లలు పుట్టరట..

ఎంత ఎక్కువ జుట్టు కత్తిరించుకుంటే అంత మంచి భర్త..
అప్పటి వరకు ఎంతో అపురూపంగా ఇష్టంగా పెంచుకున్న జుట్టుని ఎంత ఎక్కువ జుట్టు కత్తిరించుకుంటే అంత మంచి భర్త వస్తాడని నమ్ముతారు అమ్మాయిలు. ఏకంగా మొత్తం గుండు చేయించుకుంటే..చాలా మంచి భర్త వస్తారని..అలాగే అత్తింటివారు కూడా చాలా మంచివారు లభిస్తారని బొరానా ప్రజల నమ్మకం. అందుకే ఇక్కడ పెళ్లైన ఆడవారు గుండుతో.. లేదంటే పొట్టి జుట్టుతో కనిపిస్తారు. గుండుతో కనిపిస్తే వారికి పెళ్లి అయినట్లే లెక్క. జుట్టుతో ఉంటే వారు పెళ్లికానివారన్నమాట.

మరి మగవారి జుట్టు విషయం పూర్తి విరుద్ధం..
మంచి భర్త కోసం ఆడవారు జుట్టు కట్ చేసుకుని గుండు గీయించుకంటే..పొడవు జుట్టు ఉన్న మగవారిని ఎంతో అదృష్టవంతుడని అంటారు ఇక్కడి జనాలు. అంటే ఫుల్ డిఫరెంట్ అన్న మాట జుట్టు విషయంలో. ఇకపోతే బోరానా ప్రజల మరో వింత నమ్మకం ఏమిటంటే..ఫోటోలు దిగకూడదు. ఫోటోలు తీయించుకుంటే వారి శరీరం అంతా రక్తంతో తడిసిపోతుందని నమ్ముతారు. కానీ వీరి ఫోటోలు గూగుల్ లో ఉంటాయి. వారిమీద వారి ఆచారాలమీద పరిశోధనలు చేసినవారు వారికి తెలియకుండా తీసిన ఫోటోలు ఉంటాయి.

 

ట్రెండింగ్ వార్తలు