కరోనా సేఫ్టీ పాడ్స్‌తో జిమ్‌లు రెడీ.. ఎగబడుతున్న కస్టమర్లు!

  • Publish Date - June 15, 2020 / 11:04 AM IST

కరోనా వైరస్ వ్యాప్తితో అందరి అలవాట్లతో పాటు అన్నీ మారిపోతున్నాయి. జిమ్‌ల రూపు రేఖలు కూడా భిన్నంగా మారిపోతున్నాయి. సౌతరన్ కాలిఫోర్నియాలో తెరిచిన ఓ జిమ్ చాలా విభిన్నంగా కనిపిస్తోంది. జిమ్ కు వచ్చే కస్టమర్లను ఎంతో ఆకర్షిస్తోంది. కరోనా భయం లేకుండా నిర్భయంగా జిమ్ చేసుకోవచ్చునని అంటున్నారు. ఆ జిమ్ పేరు..రెడోండో బీచ్ జిమ్.. సోమవారమే ఈ జిమ్ తిరిగి తెరిచారు. ఆర్టీసియా బౌలేవార్డ్‌లోని ఇన్‌స్పైర్ సౌత్ బే ఫిట్‌నెస్‌లోకి వెళ్లేవారికి వారి చేతులను శుభ్రపరచుకోవాలంటున్నారు. వారి శరీర ఉష్ణోగ్రతను చెక్ చేస్తున్నారు. కస్టమర్లు సంతకం చేయగానే ఒక పాడ్‌ కేటాయిస్తారు. ఒక్కో ప్యాడ్‌లో వేర్వేరు డంబెల్స్, ఇతర పరికరాలను లోపల ఉంచుతున్నారు. పాడ్లు షవర్ కర్టెన్లు, పైపులను ఉపయోగించి నిర్మించడానికి మూడు రోజులు పట్టిందని ప్లెక్సిగ్లాస్ డివైడర్లను ఏర్పాటు చేయడానికి తక్కువ ఖర్చు అయిందని జిమ్ యజమాని పీట్ సాప్సిన్ చెప్పారు.

కరోనావైరస్ వ్యాప్తితో జిమ్‌లు, ఫిట్‌నెస్ కేంద్రాలు నెలల తరబడి మూతబడ్డాయి. ఇప్పుడు తమ ఖాతాదారులకు కొంచెం సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా జిమ్‌లను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఒకేసారి తొమ్మిది మంది జిమ్‌గోయర్స్ మాత్రమే లోపలికి అనుమతిస్తారు. జిమ్‌లో సాధారణ సామర్థ్యంలో దాదాపు సగం ఉంటుంది. లాస్ ఏంజిల్స్ కౌంటీతో సహా రాష్ట్ర ఆమోదం పొందిన కౌంటీలు జిమ్‌లు, ఫిట్‌నెస్ కేంద్రాలు, ఇతర కేంద్రాలకు తిరిగి తెరవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. దీనికి సంబంధించి రాష్ట్రం మార్గదర్శాలను విడుదల చేసింది. అన్నీ తక్కువ సామర్థ్యంతో, కెమకిల్ స్ప్రే, సామాజిక దూరానికి నియమాలతో రన్ చేయాల్సిందిగా సూచించాయి. 

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. జిమ్‌లను సందర్శించే వారు 6 అడుగుల దూరంలో ఉంచే ఫేస్ షీల్డ్‌లతో వ్యక్తిగత ట్రైనర్‌లను చూసుకోవాలి. వ్యాయామ మిషన్ లపై హ్యాండ్ శానిటైజర్, తుడవడం చేయడాలని, జిమ్‌ పరికరాలను వాడిన తర్వాత కస్టమర్లు వాటిని శుభ్రం చేయాలి. గ్రూపు శిక్షణా తరగతుల్లో తక్కువ మంది పాల్గొనేవారు లేదా ఆరుబయట తరలిస్తారు. ఒకేసారి ఒక సదుపాయంలో వ్యక్తుల సంఖ్యను పరిమితం చేయడానికి ఫిట్‌నెస్ కేంద్రాలు రిజర్వేషన్ల వ్యవస్థను అమలు చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది.