G20 Summit : స్పానిష్ అధ్యక్షుడు పెడ్రో సంచెజ్‌కు కరోనా…జి 20 సదస్సుకు డుమ్మా

స్పానిష్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ కొవిడ్ బారిన పడ్డారు. తనకు జరిపిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలిందని, దీంతో తాను న్యూఢిల్లీలో జరగనున్న జి20 సదస్సుకు హాజరు కావడం లేదని స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ శుక్రవారం చెప్పారు....

Spanish President Pedro Sánchez

G20 Summit : స్పానిష్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ కొవిడ్ బారిన పడ్డారు. తనకు జరిపిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలిందని, దీంతో తాను న్యూఢిల్లీలో జరగనున్న జి20 సదస్సుకు హాజరు కావడం లేదని స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ శుక్రవారం చెప్పారు. తనకు కరోనా సోకినా బాగానే ఉన్నానని సాంచెజ్ ఎక్స్ లో పోస్టు చేశారు. (Spanish President Pedro Sánchez tests Covid positive)

Chandrababu : పాపం.. జగన్ చాలా పేదవాడు, కూతురిని చూసేందుకు రూ.40కోట్లు ఖర్చు పెట్టాడు- చంద్రబాబు సెటైర్

తాను కరోనా వల్ల జి20 సదస్సుకు వెళ్లలేనని,(skip G20 Summit) ఈ సదస్సులో స్పెయిన్ తాత్కాలిక ఉపాధ్యక్షులు నాడియా కాల్వినో, విదేశాంగశాఖ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బరేస్ ప్రాతినిధ్యం వహిస్తారని స్పెయిన్ అధ్యక్షుడు చెప్పారు. కరోనా సోకడంతో స్పెయిన్ అధ్యక్షుడు జీ20 సదస్సుకు గైర్హాజరు అయ్యారు.

The Beast: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కారు చాలా పవర్‭ఫుల్.. మన కార్లన్నీ బలాదూర్

చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లు కూడా ఈ సదస్సుకు హాజరు కావడం లేదు. దేశ రాజధాని నగరమైన న్యూఢిల్లీలో జి20 సదస్సు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనుంది. ఈ సమావేశానికి అమెరికాతోపాటు బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యూఏఈ దేశాల నేతలు హాజరు కానున్నారు.

ట్రెండింగ్ వార్తలు