Chandrababu : పాపం.. జగన్ చాలా పేదవాడు, కూతురిని చూసేందుకు రూ.40కోట్లు ఖర్చు పెట్టాడు- చంద్రబాబు సెటైర్

పేదవాడి కూతురు ప్రేమకి రూ.40 కోట్లు ఖర్చు. ప్రజల పనులు మాత్రం చేయరు అని చంద్రబాబు ధ్వజమెత్తారు. Chandrababu - YS Jagan London Tour

Chandrababu : పాపం.. జగన్ చాలా పేదవాడు, కూతురిని చూసేందుకు రూ.40కోట్లు ఖర్చు పెట్టాడు- చంద్రబాబు సెటైర్

Chandrababu - YS Jagan London Tour (Photo : Google)

Updated On : September 8, 2023 / 12:20 AM IST

Chandrababu – YS Jagan London Tour : ఏపీ సీఎం జగన్ లండన్ పర్యటనపై టీడీపీ అధినేత చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. పాపం, ముఖ్యమంత్రి జగన్ పేదవాడు అని జాలి చూపించారు. ప్రత్యేకమైన విమానంలో లండన్ వెళ్ళాడని అన్నారు. రూ.40 కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్ళాడని చెప్పారు. కూతురిని చూసేందుకు ముఖ్యమంత్రి జగన్ 40కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చంద్రబాబు అన్నారు. ముఖ్యమంత్రి జగన్.. ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

Also Read..Chandrababu: నన్ను అరెస్టు చేస్తారేమో..! టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..

జగన్.. పేదవాళ్లు చేయాల్సిన పనులు చేస్తున్నారా? రాబోయే రోజుల్లో పేటీఎం బ్యాచ్ కి బుద్ధి చెబుతాం. గతంలో నిధులు మంజూరు చేసినా అభివృద్ధి పనులు పూర్తి చేయరు. పేదవాడి కూతురు ప్రేమకి రూ.40 కోట్లు ఖర్చు. ప్రజల పనులు మాత్రం చేయరు అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

”చంద్రబాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా గుత్తిలో రోడ్ షో లో చంద్రబాబు మాట్లాడారు. గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిపై మండిపడ్డారు. ముగ్గురు అన్నదమ్ములు ఎమ్మెల్యేలు. ఓ ఎమెల్సీ. మరో వ్యక్తి టీటీడీ బోర్డు మెంబర్. ఒక్కొక్కరు ఒక్కొక్కటి పంచుకొని దోచుకుంటున్నారు. ఇసుక, మైనింగ్ సహా అన్నింటిలో దోచుకుంటున్నారు. ప్రజలను దోపిడీ చేస్తున్నారు” అని మండిపడ్డారు చంద్రబాబు.

Also Read..Gudivada: కొడాలి నానిని ఓడించాలంటే సరైనోడు ఉండాల్సిందే.. టీడీపీ టిక్కెట్ ఎవరికి!