China Vs Taiwan : డ్రాగన్ ది ఎప్పుడూ డర్టీ మైండే. తన స్వార్థం కోసం ఎవరినైనా నట్టేట ముంచడం చైనాకు అలవాటే. అవసరానికి ఏ దేశాన్నైనా వాడుకోవడం, తర్వాత ఆగం చేయడం.. ఆ కంట్రీ కన్నింగ్ మైండ్ కు ఎగ్జాంపుల్. చైనా ఆధిపత్య ఆశ ఇంకా పెరిగిపోయి చిన్న దేశమైన తైవాన్ ను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. అంతేకాదు చైనాలో తైవాను విలీనాన్ని ఎవరూ అపలేరు అంటూ ధమ్మీలు ఇచ్చేస్తున్నారు జిన్ పింగ్.
తైవాన్ ను తాము సొంత భూభాగంగా భావిస్తామంటో చైనా. ఈ వాదనను తైవాన్ తిరస్కరిస్తోంది. దాంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు పీక్స్ కు చేరుకుంటున్నాయి. చైనా-తైవాన్ మధ్య యుద్ధం రాబోతోందా? వార్ అంటూ వస్తే తైవాన్ డ్రాగన్ ను ఢీకొట్టగొలదా? తైవాన్ కు ఏ దేశమైన అండా నిలిచే అవకాశం ఉందా?
చైనాది ఆధిపత్య పొగరు. తైవాన్ ది స్వయం ప్రతిపత్తితో ఉండాలనే ఆత్మ గౌరవం. ఆధిపత్యం, ఆత్మ గౌరవానికి అసలేమీ అసలే గిట్టడం లేదు. కాబట్టి ఆ రెండు దేశాల మధ్య కొన్నేళ్లుగా వివాదం నడుస్తూనే ఉంది. డ్రాగన్ తో కలిసేందుకు తైవాన్ ససేమిరా అంటోంది. స్వేచ్చ, స్వతంత్రం కోసం వేరుగా సెపరేట్ గానే ఉంటామంతోంది. చైనా మాత్రం.. తైవాన్ ఎప్పటికైనా తమతో కలవాల్సిందే అంటోంది. అసలు చైనా-తైవాన్ మధ్య వివాదం ఏంటి? తైవాన్ ను ఆక్రమించేందుకు డ్రాగన్ ఎందుకు ఆరాటపడుతోంది? తైవాన్ ను కు అమెరికా అందిస్తున్న సహకారం ఏంటి?
Also Read : భారత్ పై కుట్ర చేయడం కాదు, ఆ ఆలోచన చేయాలన్నా వణుకే..! ఇండియా అమ్ములపొదిలోకి గేమ్ ఛేంజర్ వెపన్స్..