SpiceJet : స్పైస్‌జెట్ EMI ఆఫర్..వాయిదాల పద్దతిలో విమాన టిక్కెట్లు కొనుక్కోవచ్చు
స్పైస్‌జెట్ EMI ఆఫర్ ప్రకటించింది. స్పైస్ జెట్ లో ప్రయాణించే ప్రయాణీకులు విమానం టిక్కెట్లను వాయిదాల పద్దతిలో కొనుక్కునే సౌలభ్యాన్ని కల్పించింది.
- nagamani
- Published On : November 8, 2021 / 04:56 PM IST
Spicejet Tickets With Emi
SpiceJet tickets with EMI : సామాన్యుల కోసం ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఓ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. విమానంలో ప్రయాణించాలనే సామాన్యుడు కల నిజం చేయాలనుకుంది. దాని కోసం స్పైస్ జెట్ విమానంలో ప్రకటించింది. విమాన టిక్కెట్ల ధరలను సులభ వాయిదాల పద్ధతిలో అంటే ఈఎంఐ రూపంలో చెల్లించేలా సౌకర్యాన్ని కల్పించింది. దీంట్లో భాగంగానే 3 నెలలు, 6 నెలలు, 12 నెలల వ్యవధితో ఈఎంఐలు చెల్లించే ఆప్షన్ ఇవ్వనుంది.
Read more : రూ.899కే విమాన టిక్కెట్
ఈ ఆఫర్‌ను ఉపయోగించాలనుకునేవారు వన్ టైమ్ పాస్‌వర్డ్ ధ్రువీకరణ నిమిత్తం శాశ్వత ఖాతా సంఖ్య(పాన్), ఆధార్, వీఐడీ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలా..టిక్కెట్లు బుక్ చేసుకోవాలనుకే ప్రయాణికులు యూపీఐ ద్వారా తొలి ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. తర్వాతి ఈఎంఐలు అదే యూపీఐ నుంచి డిడక్ట్ అవుతాయి. క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో..ఇటువంటి ఆఫర్ ను వినియోగించుకోవాలనుకునే ప్రయాణీకులు ఈ పద్ధతి ద్వారా విమానం యానం చేసే సౌలభ్యం పొందవచ్చు.
Read more : విమానం టిక్కెట్లు బుక్ చేస్తూ.. రూ.3కోట్లు నొక్కేసిన మహిళ
