విమానం టిక్కెట్లు బుక్ చేస్తూ.. రూ.3కోట్లు నొక్కేసిన మహిళ

  • Published By: nagamani ,Published On : June 19, 2020 / 07:28 AM IST
విమానం టిక్కెట్లు బుక్ చేస్తూ.. రూ.3కోట్లు నొక్కేసిన మహిళ

పొట్టోళ్లు గట్టోళ్లంటారు కదా..చైనాదేశం ఇతర దేశాల భూభాగాలను కబ్జాలు చేస్తుంటే..ఈ చైనా మహిళ కూడా మోసాలకు తెగబడతు కోట్ల రూపాయలు నొక్కేసింది. ఈ చైనా మహిళ చేసిన మోసం బైటపడటంతో అధికారులు కూడా నోరెళ్లబెట్టాడు. ఏమాత్రం కష్టపడకుండా కోట్లు నొక్కేసిన వైనాన్ని బైటపెట్టారు. విమానం టికెట్లు బుక్ చేస్తుంది. కానీ ప్రయాణం మాత్రం చేయదు. వాటిపై వచ్చే నష్టపరిహారం డబ్బుల్ని చక్కగా చక్కబెట్టేస్తోంది ఈ చైనా మహిళ. అదేంటీ విమానం టిక్కెట్లు బుక్ చేసి ప్రయాణించకపోతే నష్టపరిహారం ఎలా వస్తుంది అని కదా మీ డౌటు? అక్కడే ఉంది ఈ చైనా మహిళ తెలివితేటలు.

వివరాల్లోకి వెళితే..చైనాలోని నాంజింగ్‌కు చెందిన 45 ఏళ్ల లీ అనే మహిళ 2015 నుంచి 2019 వరకు దాదాపు 900 విమాన టికెట్లను బుక్ చేసింది. ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడతాయో ఆయా వాతావరణ పరిస్థితులను తెలుసుకుని ఆయా ప్రాంతాల్లో ప్రయాణించే విమానాల టిక్కెట్లు బుక్ చేస్తుంది. వర్షాలు పడే పరిస్థితులు ఎప్పుడెప్పుడు ఉంటాయో చూసుకొని మరీ టికెట్లు బుక్ చేసేది. 

వాటితో పాటు ఫ్లైట్ డిలే/కేన్సిల్ ఇన్సూరెన్స్‌లను కూడా వదిలిపెట్టకుండా వాటిని కొనుగోలు చేసేది. అక్కడ కూడా తన తెలివితేటల్ని ఉపయోగిస్తూ..తన ఒక్కరి పేరునే పదే పదే వాడితే అధికారులకు అనుమానాలు వస్తాయని ముందే జాగ్రత్త పడింది. తన స్నేహితులు, కుటుంబ సభ్యుల పేర్లను కూడా చక్కగా వాడేసుకుంది.  

అలా మొత్తం 20 మంది పేర్లతో టికెట్లను బుక్ చేసుకుని, ఏకంగా రూ.3.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులను నొక్కేసింది. కానీ అధికారులకు ఆమెపై అనుమానం రానేవచ్చింది. దీంతో నిఘా పెట్టారు. ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.  దీంతో లీ ని నాంజింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Read: కలిసి నివసించే వారిలో కరోనా వైరస్ సులభంగా వ్యాపిస్తుంది