పాటలు పాడటం, అరవడం ద్వారా Corona వ్యాప్తి

  • Publish Date - September 30, 2020 / 08:08 AM IST

virginia tech university : పాటలు పాడటం, అరవడం ద్వారా కరోనా (Corona) వ్యాప్తి చెందుతుందనే కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. వైరస్‌ సోకిన వ్యక్తి నుంచి దగ్గు, తుమ్ము, ముక్కు చీదడం, పాటలు పాడటం, అరవడం,మాట్లాడడం, గాలి పీల్చుకోవడం, వదలడం వంటి చర్యల ద్వారా వివిధ సైజుల్లో తుంపర్లు వెలువడుతాయనే సంగతి తెలిసిందే.



ఈ తుంపర్లు ఏ సైజులో ఉంటే ఎలా ప్రభావితం చేస్తాయి? ఎంత దూరం, ఎలా పయనిస్తుంది ? తదితర అంశాలపై వర్జీనియా టెక్‌ వర్సిటీ (virginia tech university) పరిశోధకులు దృష్టి కేంద్రీకరించారు. చిన్న సైజు తుంపర్లు, సిగిరెట్‌ పొగ మాదిరిగా వ్యాప్తిచెందే తుంపర్లు కొన్ని గంటల వరకు గాలిలోనే ఉండిపోతాయంటున్నారు.



‘ఏరోసొల్స్‌’గా పిలుస్తున్న ఈ చిన్నసైజు తుంపర్లు ఆరు అడుగులకు మించి వ్యాపించే అవకాశాలున్నాయంటున్నారు. సో…భౌతిక దూరం (6 అడుగులు) కంటే ఎక్కువగా ఉంటేనే బెటర్ అని వర్జినీయా టెక్ వర్సిటీ పరిశోధకులు లిన్సేమార్ తెలిపారు.



దగ్గినపుడు, తుమ్మినపుడు పెద్ద పెద్ద సైజు తుంపర్లు వెలువడుతాయని యూఎస్ లోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డిప్యూటీ డైరెక్టర్ డా.జ.బట్లర్ తెలిపారు. కొన్ని నెలల క్రితం సామూహిక ప్రార్థనలకు సంబంధించిన రిహార్సల్‌ నిర్వహించినపుడు కరోనా లక్షణాలున్న వ్యక్తినుంచి 52మందికి అది సోకడమే కాకుండా వారిలో ఇద్దరు మరణించినట్టుగా పరిశోధకులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు