squirrel : ఉడుత చేసిన పనికి 3,000 ఇళ్లకు కరెంట్ కట్..ప్రభుత్వ కార్యక్రమాలకు అంతరాయం

ఓ చిట్టి ఉడుత చేసిన పనికి వేలాది మంది చీకట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులకు అంతరాయం ఏర్పడింది.

squirrel blamed for massive power outage : చెంగు చెంగున చెట్లపై తిరిగే ఉడుత అంటే ఎవరికైనా ముద్దొస్తుంది. పట్టుకోవటం దొరకదు. అటువంటి ఓ చిట్టి ఉడుత చేసిన పనికి పాపం వేలాది మంది చీకట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాలోని నార్త్ కరోలినాలో ఓ ఉడుత చేసిన పనికి మూడు వేల ఇళ్లల్లో జనాలు చీకట్లో ఉండిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఓ ఉడుత కరెంట్ సరఫరా నిలిపివేసింది. దీంతో అనేక కార్యక్రమాలకు నిలిచిపోయాయి.

నివాసాలకు..వ్యాపారాలకు.. విద్యుత్ సరఫరా నిలిచిపోవటంతో ప్రభుత్వ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. సాధారణంగా ఎలుకలు ఇటువంటిపనులు చేస్తుంటాయి. వైర్లు కొరికేయటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటం జరుగుతుంది. కానీ ఉడత వల్ల కరెంట్ నిలిచిపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవునండీ నార్త్ కరోలినాకు చెందిన యుటిలిటీ కంపెనీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటానికి ఉడుత నే కారణమని ప్రకటించింది.

జూన్ 22న ఉదయం ఒక ఉడుత పవర్ సప్లై వైరింగ్‌లోకి వచ్చి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించింది. దాంతో దాదాపు అరగంట పాటు డౌన్‌టౌన్‌లోని వ్యాపార, ప్రభుత్వ కార్యాలయాలు, పౌరుల నివాసాలు సహా మొత్తం 3,000 మంది కస్టమర్లకు తీవ్ర ఇబ్బంది కలిగింది. పవర్ సప్లయ్‌కి ఆటంకం కలిగిన వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది.. తీవ్రంగా శ్రమించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

ఉడుత చేసిన పనివల్ల ప్రభుత్వ కార్యాలయాలు, ప్రయివేటు కార్యాలయాలు ఎఫెక్ట్ అయ్యాయని, ఇ-సేవల్లో డీడ్స్ రిజిస్టర్, ప్లానింగ్, ట్యాక్స్ కలెక్షన్స్, హెల్త్ డిపార్ట్‌మెంట్, ప్రభుత్వ పరిపాలన, కుటుంబ న్యాయ కేంద్రం, ఎన్నికల సేవలు, ఆర్థిక సేవలు ప్రభావితమయ్యాయని ఉత్తర కరొలినా విద్యుత్ సంస్థ వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు