Sri Lanka: శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన విక్రమెసింఘె

శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రాణిల్ విక్రమెసింఘె అఖిలపక్ష సమావేశం నిర్వహించి స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు. సామాజికంగా నెలకొన్న గందరగోళ పరిస్థితులను చక్కదిద్దేందుకు గానూ సోమవారం నుంచే అమలు చేయనున్నారు.

Sri Lanka: శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రాణిల్ విక్రమెసింఘె అఖిలపక్ష సమావేశం నిర్వహించి స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు. సామాజికంగా నెలకొన్న గందరగోళ పరిస్థితులను చక్కదిద్దేందుకు గానూ సోమవారం నుంచే అమలు చేయనున్నారు. పబ్లిక్ సెక్యూరిటీ, పబ్లిక్ ఆర్డర్, నిత్యవసర వస్తువుల సరఫరా వంటి వాటిని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 40(1)(సీ) ప్రకారం.. విక్రమసింఘే చేసిన ప్రకటనలో, పబ్లిక్ సెక్యూరిటీ ఆర్డినెన్స్ (చాప్టర్ 40)లోని సెక్షన్ 2 (చాప్టర్ 40) సవరించిన ప్రకారం అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. 1959 చట్టం నెం. 8, 1978 చట్టం సంఖ్య 6, 1988 యొక్క చట్టం సంఖ్య 28 ద్వారా మీడియా వెల్లడించింది.

దేశం విడిచి సింగపూర్‌కు పారిపోయిన తర్వాత మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. రాజధాని కొలంబోలోని ఆయన అధికారిక నివాసాన్ని పదివేల మంది నిరసనకారులు ముట్టడించిన తర్వాత అధ్యక్షుడు మొదట మాల్దీవులకు వెళ్లారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికలకు మంగళవారం నామినేషన్లు జరుగుతాయని, శ్రీలంక కొత్త అధ్యక్షుడిని జూలై 20న ఎన్నుకోనున్నట్లు శ్రీలంక పార్లమెంట్ ప్రకటించింది.

Read Also: కేంద్రం కీలక నిర్ణయం.. శ్రీలంక సంక్షోభంపై అఖిలపక్ష భేటీకి పిలుపు

యుక్రెయిన్‌తో యుద్ధం చేస్తోన్న ర‌ష్యాపై ఆంక్ష‌లు విధించినంత మాత్రాన అది మోకరిల్లబోదని శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అన్నారు. అంతేగాక‌, ర‌ష్యాపై ఆంక్ష‌లు విధిస్తే దాని ప్ర‌భావం ఇత‌ర దేశాలపై ప‌డి ఆహార కొర‌త‌, ధ‌ర‌ల పెరుగుద‌ల వంటి ప్ర‌తికూల ప‌రిణామాలు చోటుచేసుకుంటాయ‌ని చెప్పారు.

చ‌మురు ధ‌ర‌ల పెరుగుద‌ల‌, నిత్యావ‌స‌రాల కొర‌త‌, ఆదాయం త‌గ్గుద‌ల వంటి ప‌రిణామాల‌తో దాదాపు 60 ల‌క్ష‌ల మంది శ్రీ‌లంక ప్ర‌జ‌లకు ఆహారం అంద‌డం గ‌గ‌నంగా మారింద‌ని ‘ప్ర‌పంచ ఆహార కార్యక్ర‌మ’ సంస్థ కొన్ని రోజుల క్రిత‌మే తెలిపింది. ఈ నేప‌థ్యంలో ర‌ణిల్ విక్ర‌మ సింఘే ర‌ష్యాపై ఆంక్ష‌ల గురించి మాట్లాడ‌డం గ‌మ‌నార్హం.

 

ట్రెండింగ్ వార్తలు