ఉగ్రశిబిరంలోనే ఆత్మాహుతి దాడి : ఆరుగురు చిన్నారులు సహా 15మంది మృతి

  • Publish Date - April 27, 2019 / 06:04 AM IST

శ్రీలంకలో హై టెన్షన్ కొనసాగుతోంది. ఈస్టర్ వేడుకల రోజున మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు టార్గెట్ గా భద్రతా బలగాలు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. సమ్మంతురై ప్రాంతంలో గాలింపు చేస్తుండగా  ఉగ్రవాదులు ఒక్కసారిగా బలగాలపై కాల్పులు జరిపారు.  అనంతరం తమను తాము పేల్చేసుకున్నారు. ఈ ఘటనలో 15మంది చనిపోయారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఘటనా స్థలంలో భారీగా  ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ముగ్గురు నేషనల్ తౌహీద్ జమాత్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా బలగాలు అనుమానిస్తున్నాయి.
Also Read : గ్రీన్ కలర్ లో కొత్త రూ.20 నోటు

ఈస్టర్ సండే రోజున ఉగ్రదాడుల తర్వాత టెర్రరిస్టుల కోసం భద్రతా బలగాలు వేట ప్రారంభించాయి. ఈ క్రమంలో శ్రీలంక తూర్పు తీరం అంపారాలోని సమ్మంతురైలో శుక్రవారం (ఏప్రిల్ 26,2019) రాత్రంతా అనుమానిత ఇస్లామిక్ ఉగ్రవాదులతో భీకర కాల్పులు జరిగాయి. సాయంత్రం ప్రారంభమైన ఎన్‌కౌంటర్ రాత్రంతా కొనసాగింది. హతమైన 15 మందిలో ముగ్గురు ఆత్మాహుతి దళ సభ్యులు ఉన్నారని మిలటరీ అధికార ప్రతినిధి తెలిపారు. ఓ ఇంటిలో నక్కిన ఉగ్రవాదులు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు నిల్వచేశారని, చట్టుముట్టినప్పుడు దాడికి పాల్పడ్డారని, దీంతో తాము కూడా కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు.

హతమైన ఉగ్రవాదులు నేషనల్ తౌహీద్ జమాత్ సభ్యులుగా అనుమానిస్తున్నట్టు చెప్పారు. ఈస్టర్ సండే (ఏప్రిల్ 21,2019) రోజున చర్చిలు, హోటల్స్ పై దాడులకు పాల్పడింది కూడా ఈ సంస్థేనని అనుమానిస్తున్నారు. పేలుళ్ల ఘటనతో సంబంధం ఉన్న 140 మంది కోసం భద్రతా దళాలు వేట ప్రారంభించాయి. ఇప్పటి వరకు 76 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సిరియా, ఈజిప్ట్ దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు.

ఈస్టర్ సండే (ఏప్రిల్ 21,2019) టార్గెట్ గా ఉగ్రవాదులు దాడులు చేశారు. చర్చిలు, హోటళ్లు లక్ష్యంగా అటాక్స్ చేసిన రక్తపుటేరులు పారించారు. ఆ ఘటన జరిగి వారం రోజులు కావొస్తున్నా శ్రీలంకలో వరుస బాంబు  పేలుళ్ల టెన్షన్ కొనసాగుతోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. సమ్మంతురై ప్రాంతంలో ముష్కరులు ఉన్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లిన బలగాలపై టెర్రరిస్టులు కాల్పులు  జరిపారు. తర్వాత తమను తాము పేల్చేసుకున్నారు. ఈ ఘటనలో 15మంది చనిపోయారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. వరుస బాంబు పేలుళ్ల వెనుక యువకులు, మహిళలు, చిన్నారులు, విదేశీయుల హస్తం ఉన్నట్టుగా బలగాలు అనుమానిస్తున్నాయి. ఇప్పటివరకు 76మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా 100మందికిపైగా ఐసిస్ సానుభూతిపరులు లంకలో ఉన్నట్టు బలగాలు భావిస్తున్నాయి.

ప్రస్తుతం లంకలో హై అలర్ట్ కొనసాగుతోంది. భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. నేషనల్ తౌహీద్ జమాత్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారే ఐసిస్ సహకారంతో లంకలో భారీ పేలుళ్లకు వ్యూహం  రచించినట్టుగా బలగాలు చెబుతున్నాయి. లంకలో మరోసారి ఉగ్రదాడులు జరగొచ్చని.. ఏప్రిల్ 26 నుంచి 30వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలని శ్రీలంకలోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ  చేసింది. దీంతో ఏ చిన్న సమాచారం అందినా భద్రతా బలగాలు రంగంలోకి దిగుతున్నాయి. ఉగ్రవాద స్థావరాలు ఉన్న ప్రాంతానికి వెళ్లి గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
Also Read : నిప్పుల కొలిమి : వరల్డ్ 15 హాటెస్ట్ నగరాలు భారత్‌లోనే