గ్రీన్ కలర్ లో కొత్త రూ.20 నోటు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త 20 రూపాయల నోటు విడుదల చేస్తోంది. ఇది ఆకుపచ్చ కలర్ లో ఉంది. త్వరలోనే రాబోతున్న ఈ నోటుపై కొత్త RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ సంతకం ఉంది. నోటు ముందు భాగంలో గాంధీ బొమ్మ పెద్దగా ఉంది. అశోకుడి స్థూపం ఉన్నాయి. RBI, BHARAT(హిందీలో), INDIA, 20లను మెక్రో లెటర్స్ రూపంలో సెక్యూరిటీగా ఉన్నాయి. నోటు వెనక భాగంలో ఎల్లోరా గుహల బొమ్మ ఉంటుంది. ఆ పక్కనే గాంధీ కళ్లద్దాల్లో స్వచ్ఛ భారత్ అనే సింబల్ ఉంది. నోటు వెనక భాగం లెఫ్ట్ సైడ్ ముద్రించిన సంవత్సరం ఉంది.
Also Read : నిప్పుల కొలిమి : వరల్డ్ 15 హాటెస్ట్ నగరాలు భారత్లోనే
ఈ నోటు తయారీ ప్రారంభం అయ్యిందని.. త్వరలోనే మార్కెట్ లోకి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది RBI. కొత్త 20 రూపాయల నోట్లు వచ్చినా.. పాత నోట్లు చెలామణిలోనే ఉంటాయి. ఎలాంటి ఇబ్బంది ఉండదని.. ప్రజలు ఆందోళన, గందరగోళానికి గురి కావొద్దని ప్రకటించారు అధికారులు. ఇక నుంచి బ్యాంకుల నుంచి వచ్చే రూ.20 నోట్లు అన్నీ కూడా కొత్తవే ఉంటాయి.