Sri Lanka: పెరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు.. లంకలో మరోసారి ఎమర్జెన్సీ
శ్రీలంకలో మరోసారి అత్యవసర పరిస్థితి విధించారు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే.
- Naresh Mannam
- Published On : May 7, 2022 / 06:31 AM IST
Srilanka Crisis
Sri Lanka: శ్రీలంకలో మరోసారి అత్యవసర పరిస్థితి విధించారు. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. 5 వారాల క్రితం నిరసనకారులు అధ్యక్ష భవనం ముట్టడించడంతో హింస చెలరేగింది. ఈ హింసలో నిరసనకారులతో పాటు.. పోలీసులు కూడా గాయపడగా.. అప్పుడు ఎమర్జెన్సీ విధించి వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు మరోసారి అత్యవసర పరిస్థితి విధించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి దేశంలో ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది.
Sri lanka political crisis: శ్రీలంక అధ్యక్షుడు, ప్రధానమంత్రిపై అవిశ్వాస తీర్మానం..
రోజురోజుకీ లంకలో పరిస్థితులు దిగజారుతున్నాయి. ప్రభుత్వం పైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ సాధారణ ప్రజలు సైతం వీధుల్లోకి వస్తున్నారు. ఆహారం, చమురు ధరలు భయంకరంగా పెరిగిపోవడంతో పాటు విద్యుత్ కోతలను నిరసిస్తూ ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేనే కారణమంటూ దేశ అధ్యక్షుడి ఇంటి వద్ద ఆందోళనకారులు నిరసనలు చేపడుతున్నారు.
Sri lanka crisis: శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్స ఔట్? ఏకాభిప్రాయ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు..
ఒక్కోసారి ప్రజల నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారడంతో పరిస్థితులు పోలీసుల చేయి దాటి ఎమెర్జెన్సీ వరకు వెళ్తుంది. ఇప్పుడు కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా రాజపక్సే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూట్రేడ్ యూనియన్లు దేశవ్యాప్త సమ్మె చేపట్టాయి. పరిస్థితిని అదుపులోకి తేవడానికి రాజపక్సే ఈ కఠినమైన ఎమెర్జెన్సీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్య ద్వారా ఐదు వారాల్లో రెండోసారి భద్రతా బలగాలకు అధికారాన్ని అందించనుంది.
