Sri lanka political crisis: శ్రీలంక అధ్యక్షుడు, ప్రధానమంత్రిపై అవిశ్వాస తీర్మానం..

శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ముందురుతుంది. ఓపక్క ఆర్థిక సంక్షోభంతో ఆ దేశ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. తినడానికి తిండికూడా సరిగా దొరకని పరిస్థితి నెలకొనడంతో ప్రజలు రోడ్లపైకొచ్చి ప్రభుత్వం

Sri lanka political crisis: శ్రీలంక అధ్యక్షుడు, ప్రధానమంత్రిపై అవిశ్వాస తీర్మానం..

Sri Lanka

Sri lanka political crisis: శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ముందురుతుంది. ఓపక్క ఆర్థిక సంక్షోభంతో ఆ దేశ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. తినడానికి తిండికూడా సరిగా దొరకని పరిస్థితి నెలకొనడంతో ప్రజలు రోడ్లపైకొచ్చి ప్రభుత్వం తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికే కేబినెట్‌లోని అనేక మంది మంత్రులు ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక రాజీనామా చేశారు. శ్రీలంక అధ్యక్షుడిగా గొటబయ రాజపక్స, ప్రధానిగా మహింద రాజపక్స కొనసాగుతున్నారు. ఇటీవల ఈ ఇరువురి మధ్య విబేధాలు తలెత్తినట్లు తెలిసింది. ఈ క్రమంలో మహింద రాజపక్సను ప్రధాని పదవి నుంచి దింపేసి వేరే వ్యక్తిని ప్రధాని పదవికి ఎంపిక చేయాలని ఆ దేశ అధ్యక్షుడు, మహింద రాజపక్స సోదరుడు గోటబయ రాజపక్స నిర్ణయించారు. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష సభ్యులతో భేటీ అయ్యారు.

SriLanka Economic Crisis Update : కిలో పాలపొడి రూ.2వేలు.. శ్రీలంకలో ఆకలి కేకలు

త్వరలో అఖిలపక్ష పార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే తాజాగా దేశ అధ్యక్షుడు, ప్రధానిపై ప్రతిపక్ష పార్టీ పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మాణాన్ని పెట్టాయి. శ్రీలంక ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎస్‌జేబీ మంగళవారం ఎస్ఎల్‌పీపీ సంకీర్ణ ప్రభుత్వం అధ్యక్షుడు గోటబయ రాజపక్స పై పార్లమెంట్ స్పీకర్ కు అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. పార్లమెంట్ స్పీకర్‌కు రెండు అవిశ్వాస తీర్మానాలు సమర్పించినట్లు సమైక్య జన బలవేగము(ఎస్‌జేబీ) ప్రధాన కార్యదర్శి రంజిత్ మద్దుమ బండారు తెలిపారు. మేము స్పీకర్‌ను ఆయన నివాసంలో కలుసుకుని రెండు అవిశ్వాస తీర్మానాలు ఇచ్చామని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 42 ప్రకారం రాష్ట్రపతికి వ్యతిరేకంగా మొదటిది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరొకటి అని అన్నారు.

Srilanka Crisis : శ్రీలంక కష్టాలు తీరే అవకాశం..ఆదుకోవటానికి ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంకు

అయితే దీనిపై త్వరలో ఓటింగ్ కోరనున్నారు. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలబెడతామని ఎస్‌జేబీ కూడా చెప్పింది. అయితే ఎస్జేబీతో పాటు మాజీ ప్రధాని రాణిల్ విక్రమ సింఘే, యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్పీ) సంయుక్తంగా అధ్యక్షుడు రాజపక్స పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం శ్రీలంక ప్రభుత్వం ఎస్జేబీ అవిశ్వాస తీర్మానంలో అవసరమైన ఓట్లను పొందలేకపోతే ప్రధాన మంత్రి మహింద రాజపక్స సహా మంత్రివర్గం రాజీనామా చేయవలసి ఉంటుంది. అదే సమయంలో టీఎన్ఏ, యూఎన్ఏ ప్రతిపాదన విజయవంతమైతే అధ్యక్షుడు తప్పనిసరిగా రాజీనామా చేయాల్సి ఉంటుంది.