SriLanka Economic Crisis Update : కిలో పాలపొడి రూ.2వేలు.. శ్రీలంకలో ఆకలి కేకలు

శ్రీలంకలో ప్రజలు ఆకలితో కేకలు వేస్తున్నారు. నిత్యావసరాలు కొనలేక, తినలేక అల్లాడుతున్నారు.(SriLanka Economic Crisis Update)

SriLanka Economic Crisis Update : కిలో పాలపొడి రూ.2వేలు.. శ్రీలంకలో ఆకలి కేకలు

Sri Lanka Economic Crisis

SriLanka Economic Crisis Update : శ్రీలంకలో ప్రజలు ఆకలితో కేకలు వేస్తున్నారు. నిత్యావసరాలు కొనలేక, తినలేక అల్లాడుతున్నారు. నెల రోజులుగా ఆందోళనలతో దేశం అట్టుడుకుతోంది. ధరలు దిగి వచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక ప్రభుత్వం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సంక్షోభం నుంచి దేశం బయటపడే దారి కనిపించకపోవడంతో ఎలా బలకాలో తెలియక ప్రజలు వలస బాట పడుతున్నారు. పసి పిల్లలకు పాలు కూడా పట్టించలేని దయనీయ పరిస్థితుల్లో దేశం దాటుతున్నారు.

Milk powder for Rs 2000 kg, A citizen explains the economic crisis in Sri Lanka

Milk powder for Rs 2000 kg, A citizen explains the economic crisis in Sri Lanka

శ్రీలంకలోని తమిళులు కొందరు సముద్ర మార్గంలో తమిళనాడు వస్తున్నారు. రెండు నెలల పసిగుడ్డును వెంట పెట్టుకుని ఓ కుటుంబం సముద్రంలో ప్రమాదకర ప్రయాణం చేసింది. తమిళనాడు తీర ప్రాంతం చేరుకుంది. ఈ తమిళ కుటంబం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో బోటులో ప్రయాణించి తమిళనాడుకి చేరుకుంది. ఆ కుటుంబాన్ని మెరైన్ పోలీసులు శరణార్ది శిబిరానికి తరలించారు.(SriLanka Economic Crisis Update)

Sri lanka crisis: శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్స ఔట్? ఏకాభిప్రాయ ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు..

శ్రీలంకలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని శరణార్ది కుటుంబం వాపోయింది. శ్రీలంకలో కిలో పాల పొడి ధర రెండు వేలు పలుకుతోందన్నారు. పిల్లలకు అత్యవసరమైన వ్యాక్సిన్లు సైతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో దొరకడం లేదని ఆదేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆకలి చావులు తప్పవని కన్నీటిపర్యంతం అయ్యారు.

Milk powder for Rs 2000 kg, A citizen explains the economic crisis in Sri Lanka

Milk powder for Rs 2000 kg, A citizen explains the economic crisis in Sri Lanka

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మొదలైన తర్వాత అక్కడి తమిళులు భారత్ కు వలస వస్తున్నారు. ఇప్పటివరకు 80మంది తమిళులు తమిళనాడు వచ్చారు. వారందరిని శరణార్ధి శిబిరాల్లో ఉంచి సహాయం చేస్తోంది ప్రభుత్వం. శ్రీలంకలోని తమిళులను ఆదుకునేందుకు అనుమతి ఇవ్వాలని తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Sri lanka crisis: నేను రాజీనామా చెయ్య.. శ్రీలంక రాజకీయాల్లో కీలక పరిణామం..

మరోవైపు లంకలో ఆందోళనలు సద్దుమణగడం లేదు. అధ్యక్ష, ప్రధాని సహా నేతలంతా రాజీనామా చేసి అన్ని పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మహింద రాజపక్సేను ప్రధాని పదవి నుంచి తొలగించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అధ్యక్షుగు గొటబాయ ఇందుకు అంగీకరించినప్పటికి పదవి నుంచి తప్పుకునేందుకు మహింద రాజపక్సే సిద్ధంగా లేకపోవడంతో ఆర్థిక సంక్షోభంతో పాటు ఆర్థిక సంక్షోభం కూడా ముదురుతోంది.

Sri lanka crisis : శ్రీలంకలో ప్రజా ఆందోళనలు ఉధృతం.. రోడ్లపైకొచ్చి మద్దతు తెలిపిన క్రికెటర్స్

తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎందుర్కొంటున్న శ్రీలంకలో ప్రజా ఆందోళనలు రోజురోజుకు మిన్నంటుతున్నాయి. నిత్యావసర ధరలు భారీగా పెరగడంతో అక్కడి ప్రజలు ఆకలితో విలవిలలాడుతున్నారు. దేశ అధ్యక్షుడు గొటబాయ, ప్రధాన మంత్రి మహింద రాజపక్సలు వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు రోడ్లపైకొచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఇంతటి ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక ఇప్పటికే అధికార కూటమి నుంచి పలువురు మంత్రులు రాజీనామా చేశారు. వీరిలో రాజపక్స కుటుంబీకులు కూడా ఉన్నారు. ప్రధానిగా మహింద రాజపక్స, అధ్యక్షుడిగా గొటబాయ రాజపక్సే కొనసాగుతున్నారు. వీరివురూ రాజీనామా చేయాల్సిందే అంటూ ఆ దేశంలో ప్రజా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.