Sri lanka crisis: నేను రాజీనామా చెయ్య.. శ్రీలంక రాజకీయాల్లో కీలక పరిణామం..

శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం కొనసాగుతుంది. ప్రజలు నిత్యావసర వస్తువులు దొరకక అల్లాడుతున్నారు. రోడ్లపైకొచ్చి ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలోనూ శ్రీలంక రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి....

Sri lanka crisis: నేను రాజీనామా చెయ్య.. శ్రీలంక రాజకీయాల్లో కీలక పరిణామం..

Srilanka Crisis

Sri lanka crisis: శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం కొనసాగుతుంది. ప్రజలు నిత్యావసర వస్తువులు దొరకక అల్లాడుతున్నారు. రోడ్లపైకొచ్చి ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలోనూ శ్రీలంక రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. తన అన్న, ప్రధానమంత్రి మహింద రాజపక్స‌తో రాజీనామా చేయించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాను సిద్ధమని దేశాధ్యక్షుడు గోటబాయ రాజపక్స తెలిపినట్లు అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అయితే ఇదే విషయాన్ని మహింద రాజపక్స కొట్టిపారేశాడు.

Srilanka Crisis : శ్రీలంక కష్టాలు తీరే అవకాశం..ఆదుకోవటానికి ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంకు

తాను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, అవసరమైతే తానే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేసినట్లు అక్కడి మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తల నేపథ్యంలో గొటబాయ, మహింద రాజపక్స మధ్య విబేధాలు కొనసాగుతున్నాయని ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని మహింద రాజపక్స స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వంలోని అన్ని పార్టీలతో దేశాధ్యక్షుడు శుక్రవారం భేటీ కానున్నారు. ఈ భేటీలో ఎలాంటి చర్చ జరుగుతుందన్న విషయం ఆసక్తికరంగా మారింది.

Srilanka Emergency : శ్రీలంకలో ముదురుతోన్న సంక్షోభం.. అధ్యక్షుడి ఆఫర్ తిరస్కరించిన ప్రతిపక్షాలు..!

శ్రీలంకలో ఓ పక్క ఆర్థిక సంక్షోభంతో పాటు రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు గుడ్ న్యూస్ చెప్పింది. కష్టాల్లో ఉన్న ఆ దేశానికి $600 మిలియన్ల ఆర్థిక సహాయం అందించడానికి ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. ఈ విషయాన్ని శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తెలిపారు. అయితే తొలి విడతలో ప్రపంచ బ్యాంకు 400 మిలియన్ డాలర్లను త్వరలో విడుదల చేస్తుందని ఆయన తెలిపారు. ఈ ప్రకటన ప్రకారం.. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శ్రీలంకను ఆదుకొనేందుకు ప్రపంచ బ్యాంక్ సహాయం చేస్తూనే ఉంటుందని తెలుస్తోంది. ప్రపంచ బ్యాంక్ నిధులు విడుదల చేస్తుందని వార్తలు రావడంతో శ్రీలంక స్టాక్‌ మార్కెట్లు పుంజుకున్నాయి. కొలంబో ఆల్-షేర్ ఇండెక్స్ గత రెండు రోజుల్లో 15శాతం నష్టపోయిన తర్వాత 4.1 శాతం వరకు పెరిగింది. బ్లూచిప్ S&P శ్రీలంక 20 ఇండెక్స్ 7శాతానికి పైగా పెరిగింది. S&P గేజ్ దాని రోజువారీ సెట్ పరిమితికి పడిపోయినందున మునుపటి రెండు సెషన్‌లలో ట్రేడింగ్ ప్రారంభమైన నిమిషాల్లోనే నిలిపివేయవలసి వచ్చింది.