Steve Jobs Daughter Eve Mocks Iphone-14 With a Hilarious Meme on Instagram
Eve Jobs: యాపిల్ నుంచి కొత్త ప్రోడక్ట్స్ వచ్చిందంటే మొబైల్ మార్కెట్లో సందడే సందడి. బుధవారం యాపిల్ సంస్థ బుధవారం ఐఫోన్-14 విడుదల చేసింది. దీనితో పాటు వాచ్‌లు, ఎయిర్ పాడ్స్, ఇతర కొన్ని గాడ్జెట్లను విడుదల చేసింది. ఇంకేముంది.. కొనుగోళ్లు, రివ్యూలు అంటూ ప్రపంచవ్యాప్తంగా హడావుడి మొదలైంది. కొత్త ప్రోడక్టుల్లో ఏమేం కొత్త విషయాలు ఉన్నాయనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.
ఇంతటి హడావుడిలో యాపిల్ సహ వ్యవస్థాపకుడు అయిన స్టీవ్ జాబ్స్ కుమార్తె ఒక షాకింగ్ కామెంట్ చేశారు. బహుశా కొత్త ఫోన్ ఆమెను అంతగా ఇంప్రెస్ చేయలేదేమో.. సోషల్ మీడియాలో ఒక వ్యంగ్యమైన మీమ్‌తో ఐఫోన్-14ను వెక్కిరించారు. ఐఫోన్-13కి ఐఫోన్-14కి తేడా ఏమీ లేదని, ఒక వ్యక్తి తను వేసుకున్న షర్ట్ లాంటిదే ఇంకొకటి కొనుకుంటున్నట్లు ఉన్ మీమ్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Steve Jobs Daughter Eve Mocks Iphone-14 With a Hilarious Meme on Instagram
యాపిల్హెడ్‌క్వార్టర్ అయిన కాలిఫోర్నియాలో బుధవారం జరిగిన ఈవెంట్‌లో ఐఫోన్ 14 సిరీస్‌లో నాలుగు స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది యాపిల్. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్స్‌ని లాంఛ్ చేసింది. భారతదేశంలో ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ధరల్ని కూడా ప్రకటించింది. ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ.79,900, ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ ధర రూ.89,900. ఇక ఐఫోన్ 14 ప్రో ప్రారంభ ధర రూ.1,29,900 కాగా, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ.1,39,900. సెప్టెంబర్ 16న ఇండియాలో సేల్ ప్రారంభం అవుతుంది. ప్రీఆర్డర్స్ సెప్టెంబర్ 9న ప్రారంభం అవుతాయి. మిడ్‌నైట్, బ్లూ, స్టార్‌లైట్, పర్పుల్, ప్రొడక్ట్ రెడ్ కలర్స్‌లో కొనొచ్చు.