Independence Day 2023
Independence Day 2023 : యుకెలో భారతీయుల దేశభక్తి ఉప్పొంగింది. లండన్‌లో భారతీయులు, పాకిస్తానీయులు 77 వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో విష్ అనే సింగర్ బాలీవుడ్ సినిమాల్లో సూపర్ హిట్ అయిన దేశ భక్తి గీతాలు పాడి అందర్నీ అబ్బురపరిచాడు.
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని లండన్ వీధుల్లో విష్ అనే గాయకుడు అద్భుతమైన బాలీవుడ్ సాంగ్స్ పాడి అందరి మనసు దోచుకున్నాడు. విష్ తరచు తన పాటలతో ఇంటర్నెట్‌లో అలరిస్తుంటాడు. తాజాగా అతను ‘మా తుజే సలామ్’, ‘సందేసె ఆతే హై’, ‘తేరి మిట్టి’ వంటి దేశభక్తి గీతాలు పాడాడు. vish.music అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో విష్ పాడుతూ కనిపించాడు. భారతీయులు, పాకిస్తానీయులు గుంపుగా ఉండి జెండాలు ఊపుతూ అతడిని ఎంకరేజ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియో క్లిప్‌కి ‘భారతీయులు, మరియు పాకిస్తానీయులు యూకేలో కలిసి జరుపుకుంటున్న వేడుకలు. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు’ అనే శీర్షిక యాడ్ చేశారు.
ఈ వీడియో ఇంటర్నెట్ మనసు దోచుకుంది. ‘అద్భుతమైన గాత్రం.. భారతీయులు,పాకిస్తానీయులను మేము కూడా ప్రేమిస్తున్నాము’.. ‘ఇది అత్తుత్తమ ప్రదర్శనలలో ఒకటి’ అంటూ కామెంట్లు పెట్టారు. ఇదిలా ఉంటే భారత్‌లో జరిగిన 77 వ స్వాతంత్ర్య వేడుకల్లో ప్రధాని మోడీ ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఐకానిక్ స్మారక చిహ్నం లాహోరీ గేట్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత ప్రధాని 90 నిముషాలు ప్రసంగం చేశారు.