Earthquake: కాలిఫోర్నియాలో భారీ భూకంపం.. ఊగిపోయిన భవనాలు.. వీడియోలు వైరల్

భూకంపం కారణంగా జాతీయ సునామీ కేంద్రం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. శాంటాక్రజ్ ప్రాంతంలో బలమైన అలలు సమీపంలో ఉన్న తీర ప్రాంతాల్లోకి చొచ్చుకొని రావొచ్చునని..

earthquake Northern California

Earthquake Northern California: అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో గురువారం తీవ్ర భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 10.44 గంటల సమయంలో భూకంపం సంభవించడంతో పలు ప్రాంతాల్లో భవనాలు ఊగిపోయాయి. దీంతో స్థానిక ప్రజలు భయంతో బయటకు పరుగులు పెట్టారు. భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. ఈ మేరకు అమెరికా భూ సర్వేక్షణ విభాగం వెల్లడించింది. భూకంపం ప్రభావంతో పెట్రోలియా, స్కాటియా, కాబ్ తదితర ప్రాంతాల్లో శక్తివంతమైన ప్రకంపనలు సంభవించడంతో భవనాలు ఊగిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read: Earthquake : భూకంపం ఎందుకు వచ్చింది? తెలుగు రాష్ట్రాలు ప్రమాదంలో ఉన్నాయా?

భూకంపం కారణంగా జాతీయ సునామీ కేంద్రం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. శాంటాక్రజ్ ప్రాంతంలో బలమైన అలలు సమీపంలో ఉన్న తీర ప్రాంతాల్లోకి చొచ్చుకొని రావొచ్చునని, తీర ప్రాంతాల్లోని ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా రాపిడ్ ట్రాన్సిట్ డిస్ట్రిక్ట్ (BART) శాన్ ఫ్రాన్సిస్కో, ఓక్ లాండ్ మధ్య నీటి అడుగున సొరంగం ద్వారా రాకపోకలను అధికారులు నిలిపివేశారు. అయితే, భూకంపం ప్రభావంతో ఏర్పడిన ప్రాణ, ఆస్తి నష్టాల సమాచారం తెలియాల్సి ఉంది.