Earthquake : భూకంపం ఎందుకు వచ్చింది? తెలుగు రాష్ట్రాలు ప్రమాదంలో ఉన్నాయా?

అసలు హైదరాబాద్ లో భూమి కంపించడం ఏమిటి? విజయవాడ పరిస్థితి ఏంటి?

Earthquake : భూకంపం ఎందుకు వచ్చింది? తెలుగు రాష్ట్రాలు ప్రమాదంలో ఉన్నాయా?

Updated On : December 5, 2024 / 1:14 AM IST

Earthquake : తెలుగు రాష్ట్రాలు ఉలికిపాటుతోనే నిద్రలేచాయి. భూకంపం క్రియేట్ చేసే భయం ఎంత భయంకరంగా ఉంటుందో ఎక్స్ పీరియన్స్ అయ్యింది. ములుగు కేంద్రంగా వచ్చిన భూకంపంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు కనిపించాయి. అసలు భూకంపం ఎందుకు వచ్చింది? టోర్నడో వచ్చి లక్షల చెట్లు కూలిన చోట, గోదారమ్మ పరుగులు తీసే ప్రాంతంలో భూమి ఎందుకు కంపించినట్లు? తెలుగు రాష్ట్రాలు ప్రమాదంలో ఉన్నాయా?

టోర్నడో వచ్చిన ప్రాంతంలో భూకంపం కేంద్రం. బుడమేరు పొంగిన చోట భూకంపం. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది? రాబోయే ప్రమాదానికి ఈ భూకంపం సంకేతంగా మారుతోందా? అసలు హైదరాబాద్ లో భూమి కంపించడం ఏమిటి? విజయవాడ పరిస్థితి ఏంటి? తెలుగు రాష్ట్రాలు అసలు సేఫేనా? భూకంప భయాలపై సైంటిస్టులు చెబుతున్న మాట ఏంటి?

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భూకంపం వచ్చినా.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5 పాయింట్ల లోపే ఉండే ఛాన్స్ ఉందన్నది అంచనా. భూకంప తీవ్రత ఆధారంగా దేశంలో పలు ప్రాంతాలను ఐదు జోన్లుగా విభజించారు. భూకంపాల ప్రమాదం ఎక్కువగా ఉండే ప్రాంతాలను జోన్ 5లో చేర్చారు. ఈ ప్రాంతాల్లో రిక్టర్ పై 7 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. జమ్ముకశ్మీర్, పశ్చిమ, మధ్య హిమాలయాలు.. ఉత్తర బీహార్, మధ్య బీహార్, ఈశాన్య రాష్ట్రాలు, రాన్ ఆఫ్ కచ్, అండమాన్ నికోబార్ దీవులు జోన్ 5లో ఉన్నాయి.

జోన్ 4లో రిక్టర్ స్కేల్ పై 6 నుంచి 7 తీవ్రతతో భూకంపాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర పంజాబ్, ఛండీగడ్, లద్దాక్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ లోని పలు ప్రాంతాలు ఈ జోన్ లోకి వస్తాయి.

తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు జోన్ 3 కిందకు వస్తాయి. భూకంప తీవ్రత మధ్యస్తంగా సంభవించే ప్రాంతాలివి. రిక్టర్ స్కేల్ పై 5 తీవ్రతతో భూకంపాలు వచ్చే ప్రాంతాలు ఈ జోన్ లో ఉంటాయి. విజయవాడ, మచిలీపట్నం, నెల్లూరు, చెన్నై, బెంగళూరు, మంగళూరు, ముంబై, పుణె, నాసిక్, కోల్ కతా, భువనేశ్వర్, కాశీ, అహ్మదాబాద్, రాజ్ కోట్, లక్నో, కాన్పూర్ లాంటి ప్రధాన పట్టణాలు ఉంటాయి.

పూర్తి వివరాలు..

Also Read : మంత్రులు ఎమ్మెల్యేలకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏంటి? ఈ కొత్త ట్రెండ్ చంద్రబాబు ఎందుకు స్టార్ట్ చేసినట్లు?