ప్రచండమైన గాలులు ప్రళయాన్ని సృష్టిండచమేమో గానీ.. బలమైన గాలులకు రన్ వేపై ఆపి ఉంచిన విమానం పక్క విమానాన్ని ఢీ కొట్టింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీప సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
దోహాలో ఊహించలేనంతగా బలమైన గాలులు వీస్తున్నాయి. గంటకు 113 కిలోమీటర్ల మేర వేగంతో వీస్తున్న గాలులు పెను ప్రమాదాలు తెచ్చిపెడుతున్నాయి. దోహాలోని Hamad international airport లో రన్ వే పై విమానాలు నిలిపారు. కానీ 787 నెంబర్ గల విమానం గాలుల ధాటికి పక్కకు వెళ్లిపోయింది. అక్కడే ఉన్న A350-900 విమానం వరకు వెళ్లి ఢీ కొట్టింది.
దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. 2020, ఏప్రిల్ 30వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గాలి ధాటికి విమానం ముందుకు ఎలా వెళ్లిందో అర్థం కావడం లేదనే కామెంట్స్ చేస్తున్నారు.
Video of the incident: https://t.co/OjLezocLOf
— Aeronews (@AeronewsGlobal) May 1, 2020
Also Read | లాక్ డౌన్ 3.0 : 1200 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణం..చివరకు మృత్యులోకాల్లోకి