Video: స్కీ రిసార్ట్‌లో గాల్లో ఊగిపోయిన చైర్‌లిఫ్ట్స్.. అందులోని ప్రయాణికులకు భయానక అనుభవం

చైర్‌లిఫ్ట్స్ ఊగిపోయిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇటలీలోని స్కీ రిసార్ట్‌లో హాయిగా విహరిద్దామని వెళ్లిన పర్యాటకులకు భయానక అనుభవం ఎదురైంది. బ్రూయిల్-సెర్వినియాలోని స్కీ రిసార్ట్‌ వద్ద వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పర్యాటకులను రానివ్వకూడదని భావించారు. చివరి ట్రిప్‌లో ఉన్న ప్రయాణికులు ఓ చైర్‌లిఫ్ట్ నుంచి దిగాల్సి ఉంది.

అదే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో చైర్‌లిఫ్ట్స్ అన్నీ ఊగిపోయాయి. గాలుల తీవ్రతతో ఏం చేయాలో కూడా అక్కడి సిబ్బందికి అర్థం కాలేదు. గాలుల తీవ్రత కాస్త తగ్గాక చైర్‌లిఫ్ట్ నుంచి పర్యాటకులకు దిగారు. వారందరూ సురక్షితంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

చైర్‌లిఫ్ట్స్ ఊగిపోయిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పర్యాటకులకు ఇటువంటి భయానక అనుభవాలు ఎదురుకాకుండా మరిన్ని చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవడానికి పర్యాటకులు ఇటువంటి ప్రదేశాలకు వస్తారని, వారి ఆందోళనను మరింత పెంచొద్దంటూ కొందరు కామెంట్లు చేశారు.

Also Read: ఎయిర్‌పోర్ట్‌లో ఈ అమ్మాయి ఎలాంటి రీల్స్ తీసుకుందో చూడండి.. లక్షల్లో ఫైన్ వేయాలని డిమాండ్

ట్రెండింగ్ వార్తలు