Sunita Williams salary: సునీతా విలియమ్స్‌ భూమి మీదకు వచ్చేస్తున్నారు.. ఆమె జీతం ఎంతో తెలుసా?

వ్యోమగాములకు జీఎస్-13తో పాటు జీఎస్-15 గ్రేడ్ పే కింద వేతనాలు అందుతాయి.

Sunita Williams

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ కొన్ని రోజుల్లో భూమి మీదకు తిరిగి రానున్నారు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో కలిసి ఆమె ఐఎస్‌ఎస్‌లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారిద్దరు క్రూ-9 మిషన్ ద్వారా దాదాపు పది నెలల తర్వాత భూమి మీదకు వస్తున్నారు.

నాసా వంటి గొప్ప సంస్థలో పనిచేస్తున్న సునీతా విలియమ్స్‌ గతంలో నేవీ అధికారిగానూ విధుల్లో పాల్గొన్నారు. ఇంతకీ సునీతా విలియమ్స్ ఎంత సంపాదిస్తారు? ఆమె జీతం ఎంత? అనే ప్రశ్న మీలో ఎవరికైనా వచ్చిందా?

యూఎస్‌ గవర్నమెంట్ గ్రేడ్ పే ప్రకారం నాసాలో వేతనాలు ఇస్తారు. వ్యోమగాములకు జీఎస్-13తో పాటు జీఎస్-15 గ్రేడ్ పే కింద వేతనాలు అందుతాయి. సునీతా విలియమ్స్‌ను సాధారణంగా జీఎస్-15 గ్రేడ్ కింద వర్గీకరిస్తారు.

Also Read: ఏ భాషనైనా బలవంతంగా రుద్దడం.. గుడ్డిగా వ్యతిరేకించడం రెండూ సరికాదు.. కానీ..: పవన్ కల్యాణ్

జీఎస్-15 కింద అత్యధిక పే అందుతుంది. దీని ప్రకారం సునీతా విలియమ్స్‌ వార్షిక జీతం సుమారు $152,258 (ఏడాదికి సుమారు రూ.1.26 కోట్లు). అంతేకాదు, సునీతా విలియమ్స్‌ వేతనంతో పాటు నాసా వ్యోమగామిగా ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారు.

ప్రతి నెల అదనంగా $12,688 (నెలకు రూ.10.5 లక్షలు) అందుతాయి. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులలాగే వ్యోమగాములకు హౌస్‌ రెంట్ అలోవెన్స్‌ వస్తుంది. అలాగే, కొంతమంది నాసా ఉద్యోగులు డిస్కౌంట్‌తో ఆటో లోన్ పొందుతారు. వీటి ద్వారా కార్లు కొనుక్కోవచ్చు.

అలాగే, విలియమ్స్ వంటి వ్యోమగాములు ఆరోగ్య బీమా కవరేజీని కూడా పొందుతారు. ఓ నివేదిక ప్రకారం ఆమె నికర విలువ సుమారు $5 మిలియన్లు. సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్ భూమి మీదకు ఈ నెల 20న తిరిగి వచ్చే అవకాశం ఉంది.

గత ఏడాది జూన్ 5న వారు అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. కేవలం 8 రోజుల అనంతరం వారు తిరిగి భూమి మీదకు రావా ఉండగా స్టార్‌లైనర్ అంతరిక్షనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారు రాలేకపోయారు.