మాస్క్ లేకపోతే కుదరదన్న సన్నీలియోన్ : కరోనా వైరస్ ఎఫెక్ట్

  • Publish Date - January 30, 2020 / 11:01 AM IST

చైనాలో ప్రబలిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించేస్తోంది. మనదేశంలో కేరళలో ఒక విద్యార్ధికి ఈవ్యాధి సోకిన లక్షణాలు బయట పడగా…మలేషియాలో ఉన్న త్రిపురకు చెందిన మరో భారతీయ వ్యక్తి వైరస్ సోకి మరణించాడు. చైనాలో 170 మంది వైరస్ సోకి మరణించగా , మరో 6వేల మంది ప్రపంచ వ్యాప్తంగా కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లోచేరి చికిత్స పొందుతున్నారు.

 

చైనాలో చిన్నగా మొదలైన వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మొదట ఇది జంతువుల నుంచి మాత్రమే వ్యాపిస్తుందని భావించారు. కానీ, ఇది మనుషుల నుంచి మనుషులకు కూడా.. అంటే తుమ్ము, దగ్గు ద్వారా కూడా వ్యాపిస్తుందని తేలింది. లాలాజలం, కన్నీటి ద్వారా కూడా వ్యాపిస్తుందని వైద్యులు అంచనా వేశారు. కాబట్టి.. ఈ వ్యాధి ఉన్నవారికి దగ్గరగా ఉండడం, ముద్దాడటం, వారు తిన్న పాత్రలను వాడటం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

దీంతో భయపడి సెలబ్రిటీలు కూడా తమ అభిమానులను దగ్గరకు రానీయటంలేదు. మరోవైపు తమ వంతు బాధ్యతగా Coronavirus కు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా  బాలీవుడ్ నటి Sunny Leone తన అభిమానులకు సెల్ఫీలు ఇచ్చేందుకు నిరాకరించింది.

లేటెస్ట్ గా  ముంబై ఎయిర్ పోర్టుకు వెళ్ళిన Sunny Leone ను గుర్తుపట్టిన అభిమానులు ఆమెను చుట్టుముట్టారు. ఆప్యాయంగా పలకరించారు. ఆమెతో సెల్ఫీలు  దిగేందుకు  పోటీపడ్డారు. దీనికి ఆమె అభ్యంతరం చెప్పింది. ఇంతకు మునుపు అభిమానులు కోసం ఆటోగ్రాఫ్ లు, సెల్ఫీలు షేక్ హ్యాండ్ లు ఇచ్చే సన్నీలియోన్ Coronavirus దెబ్బకు భయపడిపోయి అభిమానులను కాస్త దూరం నుంచే పలకరించటం మొదలెట్టింది.

సెల్ఫీలకు చాన్స్ ఇవ్వలేదు. పైగా  Coronavirus బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తోంది ఈ శృంగార దేవత.  మూతికి మాస్క్ పెట్టుకుంటేనే తనతో సెల్ఫీ  దిగవచ్చని షరతు  పెట్టింది. షరతు పెట్టటమే కాదు తాను ధరించింది. సన్నీలియోన్ ముంబై ఎయిర్ పోర్టులో అభిమానులకు  మాస్క్ లు ధరించమని చెప్పిన వీడియో ఒకటి  ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. 

సన్నీలియోన్ మాటకు ఒప్పుకున్న అభిమానులు ముఖాలకు మాస్క్ లు ధరించి సన్నీ లియోన్ తో సెల్ఫీలు దిగారు. ఈ విషయాన్ని  సోషల్ మీడియాలోకూడా పంచుకుంది Sunny Leone.  మన చుట్టు పక్కల ఏం జరుగుతోందో  గమనించండి… కరోనా మనకు రాదులే అనుకోకుండా జాగ్రత్తగా ఉండండి అని హితవు పలికింది.

 


 

 

ట్రెండింగ్ వార్తలు