×
Ad

Searching For Parents : ఎక్కడున్నావమ్మా…కన్నవారి కోసం 40 ఏళ్ల వ్యక్తి గాలింపు

కన్న తల్లి తండ్రుల కోసం 40 ఏళ్ళ వ్యక్తి గాలింపు చేపట్టాడు. కర్ణాటక ధార్వాడకు చెందిన  వ్యక్తిని అతని తల్లితండ్రులు మూడేళ్ల వయస్సున్నప్పుడు..1980ల్లో  ఒక స్వీడన్ జంటకు దత్తత ఇచ్చేశార

  • Published On : February 8, 2022 / 08:37 AM IST

Searching for parents

Searching For Parents :  కన్న తల్లి తండ్రుల కోసం 40 ఏళ్ళ వ్యక్తి గాలింపు చేపట్టాడు. కర్ణాటక ధార్వాడకు చెందిన  వ్యక్తిని అతని తల్లితండ్రులు మూడేళ్ల వయస్సున్నప్పుడు..1980ల్లో  ఒక స్వీడన్ జంటకు దత్తత ఇచ్చేశారు. వారితో పాటు స్వీడన్ వెళ్లిన బాలుడు పెరిగి పెద్దవాడయ్యాడు.

పెయింటర్ గా స్వీడన్ లో పని చేసుకుంటున్న అతనికి ఇప్పుడు తనను  కన్నతల్లితండ్రులను కలుసు కోవాలనే కోరిక కలిగింది.  ఆ తపన అతనిలో రోజు రోజుకూ పెరగసాగింది.  ప్రస్తుతం పెరగి పోయిన సోషల్ మీడియా ద్వారా  తన తల్లి తండ్రులను తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

అందులో భాగంగా తనచిన్ననాటి ఫోటోను ట్విట్టర్, ఫేస్ బుక్ ఇతర సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తనకు మిగిలిన ఆధారం ఈ ఫోటోనేనని, తన కన్నవారు ఎవరో తెలియజేయాలని కోరుతున్నాడు. తనకు ఇప్పటికీ తల్లి ముఖం అస్పష్టంగా గుర్తుందని తెలిపాడు.
Also Read : Tirumala Ratha Saptami : ఒకేరోజు ఏడు వాహనాలపై శ్రీవారి దర్శనం
ప్రధాని మోదీ, పీఎం ఆఫీసు ట్విట్టర్‌ ఖాతాలకూ తన బాధను ట్యాగ్‌ చేశాడు. ఈ నేపథ్యంలో అతని విజ్ఞప్తిని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం ధార్వాడ ఎస్పీ కృష్ణకాంత్‌ను ఆదేశించినట్లు తెలిసింది.