Swimmer Eaten by Shark: స్విమ్మర్‌ను తినేసిన 13అడుగుల తిమింగళం

సముద్రంలో ఈదుతున్న వ్యక్తిని అమాంతం దాడి చేసి మింగేసింది తిమింగళం. స్థానిక చేపలు పట్టే వ్యక్తి, బీచ్ లో కూర్చొని వీక్షించేవాళ్లు నిస్సహాయంగా అలా చూస్తుండిపోయారు.

Sydney Australia

Swimmer Eaten by Shark: సముద్రంలో ఈదుతున్న వ్యక్తిని అమాంతం దాడి చేసి మింగేసింది తిమింగళం. స్థానిక చేపలు పట్టే వ్యక్తి, బీచ్ లో కూర్చొని వీక్షించేవాళ్లు నిస్సహాయంగా అలా చూస్తుండిపోయారు. సిడ్నీలోని బుచ్చన్ పాయింట్ వద్ద జరిగిన ఘటనతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

వ్యక్తి ఆచూకీ తెలియకపోగా దాడి చేసిన వెంటనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు చెబుతున్నారు. మనిషిని మింగేసి కొంత భాగం కొరికి ముక్కలుగా వదిలేసింది.

ఆ ఫుటేజిలో దాడి చూసిన వారి కేకలే వినిపిస్తున్నాయి. ఒక్క చేపలు పట్టే వ్యక్తి మాత్రమే ‘తిమింగళం ఏదో తింటుంది. ఓ మనిషి. అది మనిషి. పెద్ద తిమింగళం అది’ అని అరుస్తున్నాడు.

‘ఐదు మీటర్ల అతిపెద్ద తెల్ల తిమింగళం స్విమ్మర్ పై దాడి చేసింది. ఏదో ఒక కారు వేగంగా వచ్చి ఆగినట్లనిపించింది. అతను పెట్టిన కేక ఇంకా వినిపిస్తూనే ఉంది. కొరికి రెండు ముక్కలుగా చేసి పడేసింది. తిరిగొచ్చి శరీర భాగంలోని ముక్కలను మింగేసింది’ అని స్థానికులు చెబుతున్నారు.

Read Also : విశాఖ తీరానికి అనుకోని అతిథి.. ప్రపంచంలోనే అతి పెద్ద చేప వేల్‌ షార్క్‌

సిడ్నీలో 1963 తర్వాత తొలిసారి తెల్ల తిమింగళం దాడి కనిపించింది. ఘటన తర్వాత స్విమ్మర్ శరీర భాగాలు కొన్ని నీళ్లలో కనిపించాయి. అతని వెట్ సూట్ ను కూడా పోలీసులు రికవరీ చేసుకున్నారు.

బుచ్చన్ పాయింట్ వద్ద సాయంత్రం 4గంటల 35నిమిషాలకు ఎమర్జెన్సీ సర్వీసెస్ స్టార్ట్ చేశారు. ముందస్తు జాగ్రత్తగా ఆ బీచ్ పాయింట్ ను క్లోజ్ చేసేశారు అధికారులు. స్విమ్మర్ కోసం రెస్క్యూ హెలికాప్టర్లు, లైఫ్ సేవర్స్ గాలింపు చేపట్టారు.

బీచ్ లో ఈతకొడుతున్న వ్యక్తి ఆ ప్రాంతం బాగా తెలిసిన వాడిగా భావిస్తున్నారు. ఒక్కసారిగా సముద్రంలోకి తిమింగళం లాక్కెళ్లి కొరికేయడంతో వెంటనే ప్రాణాలు కోల్పోయుండొచ్చని వైద్యులు చెబుతున్నారు.

Read Also : మ‌త్స్య‌కారుడికి చిక్కిన 7 అడుగుల సొరచేప..