250 kg shark : మత్స్యకారుడికి చిక్కిన 7 అడుగుల సొరచేప..
ఓ మత్స్యకారుడి వలకు ఓ భారీ సొరచేప చిక్కుకుంది.7 అడుగుల పొడవు..250 కిలోల బరువు కలిగిన ఆ చేపను చూడగానే భయంతో వణికిపోయాడు.

Fisherman 7 Foot And 250 Kgs Shark
fisherman 7 foot and 250 kgs shark : మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళితే ఎన్నో రకాల చేపలు వలకు చిక్కుతాయి.వాటిలో అరుదైన చేపలు చిక్కితే ఆ గంగపుత్రుడి పంట పండినట్లే. కానీ రాకాసి చేపలు వలలో పడితే వలే గింజుకుపోతాయి.ఒక్కోసారి బోటును కూడా తల్లక్రిందులు చేసేస్తాయి. అటువంటి చేపలతో మత్స్యకారులకు ప్రమాదమే అని చెప్పాలి. కానీ కష్టనష్టాలకు ఓర్చుకుని గంగమ్మ తల్లినే నమ్ముకుని జీవిస్తుంటారు మత్స్యకారులు. అందుకే వారిని గంగపుత్రులు అంటారు.
Read more :శ్రీకాకుళం జాలరి వలకు చిక్కిన కత్తిముక్కు చేప : ధర రూ.8 వేల 500
అలా చేపల వేటకు వెళ్లిన ఓ. మత్స్యకారుడి వలకు ఓ భారీ సొరచేప చిక్కుకుంది సొరచేపలు వలలో పడితే వారి పంట పండినట్లే. అదే సమయంలో ప్రమాదం కూడా. కొన్ని సొరచేపలు చాలా వైల్డ్ గా ఉంటాయి. వలను కొరికిపడేయటమే కాదు బోటును కూడా తల్లక్రిందులు చేసేస్తాయి. కానీ యూకేలో ఓ మత్స్యకారుడి వలకు చిక్కిన ఓ 7 అడుగుల పొడవు..250 కిలోల భారీ షార్క్ చేపను మాత్రం అతను చాలా కష్టపడి బోటులోకి లాగాడు.
దీంతో ఆ మత్స్యకారుడు రికార్డు బ్రేక్ చేశాడు. 7 అడుగుల పొడవు, 250 కిలోలు ఉన్న ఓ భారీ షార్క్‌ను పట్టుకోవటమేకాదు దాన్ని కష్టపడి బోటులోకి లాగటమంటే మాటలు కాదు. యూకేలోని డెవోన్ తీరంలో చేపల వేటకు వెళ్లిన సిమోన్ డేవిడ్‌సన్ అనే మత్స్యకారుడికి ఈ భారీ షార్క్ చేప చిక్కింది. గంటపాటు చెమటోడ్చిన అతడు దానిని పడవలోకి లాగగలిగాడు. ఆ తర్వాత మరో ఐదుగురు కలిసి దానిని తిరిగి సముద్రంలోకి వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ భారీ షార్క్.. అతని పడవకు దగ్గరగా వచ్చి వెళ్తుండటం ఆ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు.
కాగా..1993లో ఓ మత్స్యకారుడికి 229 కిలోల షార్క్ దొరకగా.. ఇప్పుడా రికార్డు బ్రేక్ అయింది. తన ఎరను అందుకున్నది ఓ భారీ షార్క్ అని తనకు తెలియలేదని..దానిని పడవలోకి ఎలాగోలా లాగిన తర్వాత అది రాక్షస చేప అని తెలిసి భయపడ్డానని డేవిడ్‌సన్ చెప్పాడు.
Read more : Gold fish : వలలోపడ్డ బంగారు చేపలు..రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన మత్య్సకారుడు
గంట పాటు ఎంతో కష్టపడి దాన్ని బోటులోకి లాగాక దాన్ని చూసి కాళ్లు, చేతులు వణికిపోయాయని తెలిపాడు. దానిని పడవలోకి తీసుకున్న తర్వాత షార్క్ కొలతలు తీసుకొని తిరిగి సముద్రంలోకి వదిలేశారు.