శ్రీకాకుళం జాలరి వలకు చిక్కిన కత్తిముక్కు చేప : ధర రూ.8 వేల 500

  • Published By: nagamani ,Published On : October 19, 2020 / 12:37 PM IST
శ్రీకాకుళం జాలరి వలకు చిక్కిన కత్తిముక్కు చేప : ధర రూ.8 వేల 500

AP Fisher man rare fish Rs.8,500 : శ్రీకాకుళం జిల్లాలోని కవిటి మండలంలో ఓ జాలరి పంట పండింది. ఓ అరుదైన చేప వలలో చిక్కటంతో ఆ చేప ఏకంగా రూ.1.70 లక్షల ధరకు అమ్ముడుపోవటంతో జాలరికి కాసుల వర్షం కురిసింది.



వర్షాకాలం వచ్చిదంటే చాలు జాలరులకు ఇటువంటి ఒక్క చేప తమకు చిక్కినా చాలనుకుంటారు. ఈ వర్షాకాలం సీజన్ లో ఏపీలోని కొంతమంది జాలరులకు అరుదైన చేపలు చిక్కాయి. దీంతో వారికి కాసుల వరాలు కురిసాయి.


ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలోని ఓ జాలరికి సముద్రంలో 300 కిలోల బరువున్న కత్తిలాంటి ముక్కు ఉన్న చేప దొరికింది. ఈ చేపను స్థానికంగా కొమ్ము కోనేము చేప అని పిలుస్తారని స్థానిక జాలరులు తెలిపారు. 8 అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పుతో ఉన్న ఈ భారీ చేపకు మార్కెట్‌లో రూ.8 వేల500 పలికింది. చేపను విశాఖకు చెందిన ఓ వ్యాపారి రూ.8500 చెల్లించి కొనుగోలు చేశాడు. దీంతో మత్స్యకారుని ఆనందంతో గెంతులు వేశాడు.


ఇంతవరకు ఇంత పెద్ద చేప తమ వలకు ఎప్పుడూ చిక్కలేదని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ భారీ చేపని చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. కాగా..ఈ వర్షాకాలం సీజన్ లో ఇటువంటి అరుదైన చేపలు జాలరులకు చిక్కి వారి పంట పడిస్తున్నాయి. గత సెప్టెంబర్ నెలలో ప్రకాశం జిల్లాలో ఓ జాలరికి చిక్కింది.



చీరాల మండలం వాడరేవు తీరంలో దోనిదేవుడు అనే మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లగా అతని వలకు అనూహ్యంగా 28 కిలోల అరుదైన కచ్చిలి చేప చిక్కింది. దీంతో అతను ఎగిరి గంతేసినంత పనిచేశాడు. ఆ చేపను కొనుగోలు చేసేందుకు పలువురు పోటీలు పడ్డారు. చివరకు అదే ప్రాంతానికి చెందిన దారకొండ అనే వ్యాపారి రూ.1.70 లక్షలు పెట్టి ఆ చేపను కొనుగోలు చేశాడు. t in rare fish Rs. 8,500 thousand in ap