డాక్టర్లు చేతులెత్తేసి జీవితాంతం వీల్ చైర్ లోనే ఉండాలన్నా.. ఆమె మళ్లీ నడవాలని పోరాడుతూనే ఉంది

డాక్టర్లు చేతులెత్తేసి జీవితాంతం వీల్ చైర్ లోనే ఉండాలన్నా.. ఆమె మళ్లీ నడవాలని పోరాడుతూనే ఉంది

Updated On : July 25, 2020 / 7:25 PM IST

ఓ స్విమ్‌వేర్ మోడల్ లేచి మళ్లీ తన కాళ్లపై తాను నిలబడాలనుకుంటోంది. కానీ, డాక్టర్లు ఆమెను జీవితాంతం వీల్ చైర్ కే పరిమితం కావలసిందే అంటున్నారు. అసలు సమస్య ఏంటి ఆమె ఆశ ఎందుకు ఆగిపోయిందో తెలుసుకుందాం. సోనియా వేరా 40 పెరాలసిస్ తో బాధపడుతూ హాస్పిటల్ కు వెళ్లింది. తాను బాధపడుతున్న చికిత్స లేని న్యూరలాజికల్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ గురించి డాక్టర్ల ముందు గోడు వెళ్లబోసుకుంది.

ట్రీట్ మెంట్ మొదలుపెట్టి సకల ప్రయత్నాలు ఆర్నెల్ల పాటు చేసినా అలాగే ఉంది. డాక్టర్లకే ఆమె నడుస్తుందనే నమ్మకం లేదు కానీ తాను నడవగలననే ధీమాతో ఉంది సోనియా. అనుకోకుండా వచ్చిన జబ్బు నుంచి అలాగే గెలవాలని.. మళ్లీ స్విమ్ వేర్ కు తానే అంబాసిడర్ గా ఉండాలని పోరాడతానని లండన్ లోని తన ఇంటి నుంచి ఇంటర్వ్యూలో మాట్లాడింది. దీని కోసం ఏ ట్రీట్ మెంట్ కైనా రెడీ అంటోన్న సోనియా మాటలు ఏంటంటే..

నేను నడవలేకపోతున్నా.. మోడలింగ్, డిజైనింగ్ ఇలాంటివేమీ నా కంపెనీ కోసం చేయలేకపోతున్నా. డ్యాన్స్ కానీ, కనీసం నా భర్తకు భార్యగా కూడా ఉండలేకపోతున్నా. నేను మళ్లీ నడవగలను. మోడలింగ్ చేయగలను అని చెప్తోంది.

మూడేళ్ల క్రితమే ఆమెకు ఈ సమస్య తెలిసిందట. నిద్ర లేచేసరికి కాసేపటి వరకూ కదలకుండా ఉండిపోయిందట. అప్పుడు కంగారుపడి తర్వాత మర్చిపోయినా ఇంత ప్రమాదం జరుగుతుందని ఊహించలేదు. ముందుగా వెళ్లిన హాస్పిటల్ టెస్టులన్నీ చేసి చేతులెత్తేశారు. ఆ తర్వాత పలు హాస్పిటల్స్ లో అదే జరుగుతుండటంతో ఆరు నెలల తర్వాత మరో నిర్ణయం తీసుకుంది.

లక్షా 16వేల అమెరికన్ డాలర్లు ఖర్చు పెట్టి తిరిగి నడవాలనుకుంటుంది. ఎలాగైనా ఆ వీల్ చైర్ ను వదిలేసి స్వతహాగా నడవడమే ఆమె కల. దీని కోసం ఫండ్స్ కావాలని సాయం కోరుతుంది.