Taliban Attack: అఫ్ఘాన్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో మహిళ, చిన్నారిపై తాలిబన్ల దాడి

శాంతిని నెలకొల్పడమే తమ ప్రధాన ఉద్దేశ్యమని చెప్పి కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద మహిళ చిన్నారిపై దాడి చేశారు.

Taliban Attack

Taliban Attack: అఫ్ఘానిస్తాన్ లో అధికారం చేజిక్కించుకున్న వెంటనే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు తాలిబన్లు. శాంతిని నెలకొల్పడమే తమ ప్రధాన ఉద్దేశ్యమని చెప్పి కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద మహిళ చిన్నారిపై దాడి చేశారు. ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

తాలిబన్ ఫైటర్లు పదునైన ఆయుధాలతో మహిళలు, చిన్నారులపై దాడి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎయిర్ పోర్ట్ నుంచి దేశం వదిలి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా చేసి ఉండొచచ్చని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎయిర్ పోర్టు నుంచి తిరిగి రావాలంటూ కాల్పులు జరిపి బెదిరించినట్లుగా వీడియోలో ఉంది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డట్లుగా తెలుస్తుంది. అందులో ఒక మహిళ, చిన్నారి కూడా ఉంది.

తాలిబన్లు కాబూల్ లో పర్యటిస్తూ.. మాజీ ప్రభుత్వ ఉద్యోగులపై కాల్పులు జరుపుతున్నారని ఫాక్స్ న్యూస్ అనే ఇంగ్లీష్ మీడియా చెప్తుంది. తక్ఖార్ ప్రాంతంలో ఓ మహిళ తలపై ముసుగు ధరించలేదని కాల్చి చంపేశారు.

మరో మీడియా అయిన సీఎన్ఎన్ ప్రకారం.. జూలై నెలలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ఫైటర్లలో ఒకరు తలుపు కొట్టి 15మందికి వంట చేయాలని చెప్పారట. తాము పేదవారిమని అంతమందికి వంటచేయలేనంటూ చెప్పడంతో ఏకే-47 రైఫిల్స్ తో దారుణంగా కొట్టారు. ఇంటి పక్కనే గ్రైనేడ్ పేల్చి వెళ్లిపోయారు.

గత వారం తాలిబాన్ల చేతిలో దాదాపు వెయ్యి మంది చనిపోయినట్లు యునైటెడ్ నేషన్స్ చెప్తుంది. ఆగష్టు 1నాటికి 4వేల 42మంది గాయపడ్డట్లు ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ వెల్లడించింది. అఫ్ఘన్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నంత కాలం తాలిబాన్ల మరింత హింసాత్మకంగా వ్యవహరించారు.