Taliban Airforce : సొంత ఎయిర్ ఫోర్స్ ఏర్పాటు దిశగా తాలిబన్

రెండు నెలల క్రితం అప్ఘానిస్తాన్ ను చేజిక్కుంచుకుని పలన సాగిస్తున్న తాలిబన్..ఇప్పుడు సొంత వాయుసేన ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. త్వరలోనే పూర్తిస్థాయిలో సొంత వైమానిక

Afghan

Taliban Airforce: రెండు నెలల క్రితం అప్ఘానిస్తాన్ ను చేజిక్కుంచుకుని పలన సాగిస్తున్న తాలిబన్..ఇప్పుడు సొంత వాయుసేన ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. త్వరలోనే పూర్తిస్థాయిలో సొంత వైమానిక దళాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నామని,గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఎయిర్‌ఫోర్స్ నిపుణులను ఇందుకోసం ఉపయోగించుకోవాలనుకుంటున్నామని..తప్పనిసరిగా వారందరూ తిరిగివస్తారని ఆశిస్తున్నట్లు తాజాగా తాలిబన్ అంతర్గత మంత్రిత్వశాఖ ప్రతినిధి ఖరీ సయీద్ ఖోస్తీ తెలిపారు. సొంత ఎయిర్ ఫోర్స్ కోసం తమ దగ్గర మంచి ప్రణాళిక ఉందన్నారు. అందుకోసం అవసరమైనవన్నీ సమకూర్చుకుంటామన్నారు.

కాగా,అప్ఘాన్ రాజధాని కాబూల్ లో నాలుగు రోజుల క్రితం సర్దార్ దావూద్ ఖాన్ హాస్పిటల్‌పై ఐసిస్-కె ఉగ్రవాదులు జరిపినట్టుగా చెబుతున్న దాడిలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఘటన జరిగిన వెంటనే తాలిబన్ పైలట్లతో కూడిన అమెరికా బ్లాక్ హాక్ సహా మూడు హెలికాప్టర్లు హాస్పిటల్ పైకప్పుపై మోహరించాయి. ఆ హెలికాఫ్టర్లలోని తాలిబన్ క్విక్ రియాక్షన్ బృందం ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపింది. ఈ ఘటన తర్వాత ఉగ్రదాడులను ఎదురొడ్డేందుకు సొంత వైమానిక దళాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నట్టు తాలిబన్ అంతర్గత శాఖ మంత్రిత్వశాఖ ప్రతినిధి తెలిపారు.

అప్ఘానిస్తాన్ రీకనస్ట్రక్షన్ స్పెషల్ ఇన్స్పెక్టర్ జనరల్ జూన్ 2021 అంచనా ప్రకారం..అప్ఘానిస్తాన్ ను తాలిబాన్ స్వాధీనం చేసుకునే ముందు..అప్ఘాన్ ఎయిర్ ఫోర్స్ వద్ద 200 కంటే ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. వీటిలో 167 విమానాలు ఉన్నాయి. అయితే, అప్ఘాన్ వైమానిక దళం నుండి తాలిబాన్ స్వాధీనం చేసుకున్న వాటిలో ఇప్పుడు ఎన్ని పని చేస్తాయనే దానిపై క్లారిటీ లేదు. తాలిబాన్ల ప్రధాన దృష్టి.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే విమానాలను ఉపయోగించాలని,వనరులను వృధా చేయకూడదని అప్ఘాన్ కు చెందిన ఓ మాజీ అధికారి తెలిపారు.

ALSO READ Fatehgarh Jail : జైలుకి నిప్పంటించి,రాళ్లు విసిరన ఖైదీలు..30మంది పోలీసులకు గాయాల