Fatehgarh Jail : జైలుకి నిప్పంటించి,రాళ్లు విసిరన ఖైదీలు..30మంది పోలీసులకు గాయాలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫరూఖాబాద్ జిల్లా జైలులో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫాయీ మెడికల్ కాలేజీలో ట్రీట్మెంట్ పొందుతూ సందీప్ కుమార్ అనే అండర్ ట్రయల్ ఖైదీ

Fatehgarh Jail : జైలుకి నిప్పంటించి,రాళ్లు విసిరన ఖైదీలు..30మంది పోలీసులకు గాయాలు

Up Jail

Fatehgarh Jail :  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫరూఖాబాద్ జిల్లా జైలులో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫాయీ మెడికల్ కాలేజీలో ట్రీట్మెంట్ పొందుతూ సందీప్ కుమార్ అనే అండర్ ట్రయల్ ఖైదీ డెంగ్యూతో చనిపోయాడన్న వార్త ఆదివారం ఉదయం జైలులో ఉన్న వారికి తెలిసింది. వార్త విన్న వెంటనే అక్కడి ఖైదీలు నిరసనకు దిగారు.

సందీప్ కుమార్ కు ట్రీట్మెంట్ అందించడంలో ఆలస్యం చేశారని ఆరోపిస్తూ.. ఆదివారం జైలులో బీభత్సం సృష్టించారు ఖైదీలు. జైలులోని పోలీసు సిబ్బందిపై రాళ్లు రువ్వారు. జైలుకు నిప్పంటించారు. ఈ ఘటనలో 30 మంది పోలీసులు గాయపడ్డారు.

ఖైదీలను చెదరగొట్టేందుకు పోలీసులు, జైలు అధికారులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినా ప్రయోజనం లేకుండా పోవడంతో పరిస్థితి చేయి దాటిపోయిందని గ్రహించిన సిబ్బంది.. అధికారులకు ఈ విషయాన్ని తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు జైలు వద్దకు భారీగా పోలీస్ బలగాలను తరలించారు.ఇక,రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది జైలులో మంటలను అదుపు చేశారు.

ఖైదీల దాడిలో గాయపడినవారిలో డిప్యూటీ జైలర్​ కూడా ఉన్నాడని ఎస్పీ అశోక్​ కుమార్​ తెలిపారు. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించినట్టు తెలిపారు. జైలులో పరిస్థితిని అదుపుచేసినట్టు వివరించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని జిల్లా మెజిస్ట్రేట్​ సంజయ్​ కుమార్​ సింగ్​ తెలిపారు.

ALSO READ Punjab Election : పంజాబ్ లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం..బీజేపీ చీఫ్