Punjab Election : పంజాబ్ లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం..బీజేపీ చీఫ్

వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుందని పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు అశ్వనీ శర్మ తెలిపారు.

Punjab Election : పంజాబ్ లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం..బీజేపీ చీఫ్

Punjab

Punjab Election: వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుందని పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు అశ్వనీ శర్మ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి వర్చువల్ గా హాజరైన అశ్వనీ శర్మ ఈ మేరకు ప్రకటించారు.

అయితే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమని ఇటీవల పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీ పెట్టిన అమరీందర్ సింగ్ వ్యాఖ్యానించగా..అప్పుడు బీజేపీ కూడా అమరీందర్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసింది. అయితే ఇప్పుడు తాము ఒంటరిగానే పంజాబ్ పోరులోకి దిగుతున్నట్లు బీజేపీ అధ్యక్షుడు పరోక్షంగా తేల్చేశారు.

కాగా,2017లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తి మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. దశాబ్దకాలంపాటు పంజాబ్ లో అధికారంలో కొనసాగిన శిరోమణి అకాళీదల్-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని 2017ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 77 సీట్లు గెల్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 20 సీట్లు గెల్చుకుని ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలవగా..బీజేపీ కేవలం 3 స్థానాలకే పరిమితమవగా,శిరోమణీ అకాళీదల్ కు 15 సీట్లు మాత్రమే వచ్చాయి.

అయితే కొద్ది నెలల క్రితం కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ బీజేపీతో దోస్తీకి శిరోమణీ అకాలీదళ్ గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. కేంద్ర కేబినెట్ మంత్రి పదవికి శిరోమణీ అకాళీదల్ నాయకురాలు హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా కూడా చేశారు.

ALSO READ Punjab fuel Prices : పెట్రోల్,డీజిల్ రేట్లను భారీగా తగ్గించిన పంజాబ్