Afghanistan: యూనివర్సిటీల్లో అమ్మాయిల నిషేధంపై కీలక ప్రకటన చేసిన తాలిబన్

ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాల నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తాయి. స్వదేశంలో సైతం తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. ‘ఆమె చదువుకోనివ్వండి’ అనే నినాదంతో అఫ్గాన్ మహిళలు ఆందోళన చేపట్టగా, వారికి మద్దతుగా పురుషులు తమ తరగతులు బహిష్కరించడం గమనార్హం. వాస్తవానికి గల్ఫ్ దేశాల్లో మహిళా సమస్యలపై మగవారి నుంచి సరైన మద్దతు లభించదు

Afghanistan: అఫ్గానిస్తాన్ దేశాన్ని పాలిస్తున్న తాలిబన్ ప్రభుత్వం.. కొద్ది రోజుల క్రితం యూనివర్సిటీ విద్యకు మహిళల్ని నిషేదిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. అనేక సంప్రదాయాల నడుమ, అనేక కట్టుబాట్లు, పద్దతుల నడుమ కళా రంగాలకు స్వేచ్ఛకు జ్ణానానికి దూరమైన స్త్రీలకు ఇప్పుడిప్పుడే చాలా హక్కులు లభిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తాలిబన్ ప్రభుత్వం తిరోగమణంలో తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా తాలిబన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

Ashok Khemka: బదిలీ రికార్డుల ఐఏఎస్ మరో సారి బదిలీ.. ఇది 56వ సారి

ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాల నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తాయి. స్వదేశంలో సైతం తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. ‘ఆమె చదువుకోనివ్వండి’ అనే నినాదంతో అఫ్గాన్ మహిళలు ఆందోళన చేపట్టగా, వారికి మద్దతుగా పురుషులు తమ తరగతులు బహిష్కరించడం గమనార్హం. వాస్తవానికి గల్ఫ్ దేశాల్లో మహిళా సమస్యలపై మగవారి నుంచి సరైన మద్దతు లభించదు. పైగా తాలిబన్ వంటి ఉగ్రవాద సంస్థలు అధికారంలో ఉన్న చోట అలాంటి మద్దతుకు ఆస్కారమే ఉండదు. కానీ అఫ్గాన్‭లో మాత్రం పెద్ద ఎత్తున మద్దతు లభించింది.

Bharat Jodo Yatra: ఎముకలు కొరికే చలిలోనూ టీ-షర్టు మీదే.. స్వెటర్ వేసుకోకపోవడానికి కారణం వెల్లడించిన రాహుల్

దీంతో తాలిబన్ ప్రభుత్వం దిగొచ్చినట్లే కనిపిస్తోంది. అబ్బబ్బే.. ఇది శాశ్వతం ఏం కాదు. కొద్ది రోజులు మాత్రమే. తొందరలోనే దీన్ని ఎత్తేస్తామని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. వాస్తవానికి ఈ నిర్ణయం కొనసాగుతుందని అఫ్గాన్ విద్యాశాఖ మంత్రి డిసెంబరులో ప్రకటన చేశారు. కానీ ఆయన హెచ్చరికలకు ఏమాత్రం బెదరకుండా అఫ్గాన్ మహిళలు చేసిన పోరాటం చేశారు. దాని ఫలితమే తాజాగా ప్రభుత్వం యూటర్న్ అని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు