Bharat Jodo Yatra: ఎముకలు కొరికే చలిలోనూ టీ-షర్టు మీదే.. స్వెటర్ వేసుకోకపోవడానికి కారణం వెల్లడించిన రాహుల్

కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో రాజీవ్ గాంధీ సమాధి వద్ద రాహుల్ టీ-షర్టుతో కనిపించారు. ఇంతటి చలిలో చెప్పులు లేకుండా రాహుల్ టీ-షర్టు మీదే అక్కడి వెళ్లడం చర్చనీయాంశమైంది. పైగా చెప్పులు లేకుండా కనిపించారు. తాజా ఈ విషయమై రాహుల్ గాంధీని ప్రశ్నించగా.. ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ముగ్గురు పేద పిల్లలు సరిగా బట్టలు లేకుండా ఉండడాన్ని చూసిన తాను..

Bharat Jodo Yatra: ఎముకలు కొరికే చలిలోనూ టీ-షర్టు మీదే.. స్వెటర్ వేసుకోకపోవడానికి కారణం వెల్లడించిన రాహుల్

Rahul revealed the reason for not wearing a sweater

Bharat Jodo Yatra: కన్యాకుమారిలో భారత్ జోడో యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఒకే టీ-షర్టు ధరిస్తున్నారు రాహుల్ గాంధీ. వాస్తవానికి యాత్ర ప్రారంభమైన నాటి నుంచే ఈ టీ-షర్టు మీద దుమారం లేసింది. అనంతరం అది చర్చగా మారింది. రోజులు గడుస్తున్నా కొద్ది ఈ టీ-షర్టు చర్చ మాత్రం పోవడం లేదు. తాజాగా ఉత్తర భారతంలో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ.. అదే టీ-షర్టులో కనిపిస్తున్నారు. వాస్తవానికి ఉత్తర భారతం చలిగా ఉంటుంది. అందునా చలికాలం. అయినప్పటికీ రాహుల్ స్వెటర్ వేసుకోకపోవడం ఆసక్తికరంగా మారింది.

Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఐఫోన్ 14, పిక్సెల్ 7 ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో బెనిఫిట్స్.. ఈసారి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!

కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో రాజీవ్ గాంధీ సమాధి వద్ద రాహుల్ టీ-షర్టుతో కనిపించారు. ఇంతటి చలిలో చెప్పులు లేకుండా రాహుల్ టీ-షర్టు మీదే అక్కడి వెళ్లడం చర్చనీయాంశమైంది. పైగా చెప్పులు లేకుండా కనిపించారు. తాజా ఈ విషయమై రాహుల్ గాంధీని ప్రశ్నించగా.. ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ముగ్గురు పేద పిల్లలు సరిగా బట్టలు లేకుండా ఉండడాన్ని చూసిన తాను.. స్వెటర్ వేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. శీతల గాలులు తన ఎముకలు కొరికి వేసేంత వరకు స్వెటర్ వేసుకోనని అన్నారు.

India vs Sri Lanka: ముగిసిన భారత ఇన్నింగ్స్.. సెంచరీతో అదరగొట్టిన కోహ్లీ.. శ్రీలంక లక్ష్యం 374 పరుగులు

‘‘యాత్రి ప్రారంభించినప్పుడు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో చాలా వేడిగా అనిపించింది. అనంతరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టాక కాస్త చలి తగిలింది. అయితే ఆ రాష్ట్రంలో యాత్ర చేస్తుండగా ఓ నరోజు ముగ్గురు పేద బాలికలు చిరిగిన దుస్తుల్లో నన్ను కలిశారు. సరైన బట్టలు లేక చలిలో గజగజ వణికిపోతున్నారు. నేను స్వెటర్ వేసుకోవద్దని అప్పుడే నిర్ణయించుకున్నాను. శీతాకాల గాలులు నా ఎముకల్ని కొరికి వేసేంత వరకు స్వెటర్ వేసుకోను’’ అని రాహుల్ గాంధీ అన్నారు.