Taliban Raids: ప్రతి ఇంట్లో తాలిబాన్ల సోదాలు.. భారత కాన్సులేట్‍‌లో అల్లర్లు

అఫ్ఘానిస్తాన్ లో భారత అధికారుల కోసం సోదాలు ఉధృతం చేశారు తాలిబాన్లు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి రిపోర్టు ద్వారా హెచ్చరికలు పంపింది. ప్రతి ఇంట్లో..

Taliban Raids

Taliban Raids: అఫ్ఘానిస్తాన్ లో భారత అధికారుల కోసం సోదాలు ఉధృతం చేశారు తాలిబాన్లు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి రిపోర్టు ద్వారా హెచ్చరికలు పంపింది. ప్రతి ఇంట్లో వెదుకుతూ కుటుంబ సభ్యులను బెదిరిండడమే కాకుండా.. ఆచూకీ కోసం ఇండియన్ కాన్యులేట్ ఆఫీసుల్లోనూ వెదుకుతున్నారని చెప్పింది.

ప్రజలపై ప్రతీకారం తీర్చుకోమని భయాందోళనలు తగ్గించాలని తాలిబాన్లు చెప్తున్నారు. అయినప్పటికీ 1990ల నాటి అరాచకాలు అక్కడి వారిని ఇంకా పట్టిపీడిస్తున్నాయి. అఫ్ఘాన్ ను తాలిబాన్లు ఆక్రమించుకోవడం అధికారికమైన మరుసటి క్షణం నుంచే దేశం వదిలి పారిపోవడం మొదలుపెట్టేశారు. ఇటీవల వారిని అడ్డుకుంటూ దాడులు కూడా చేశారు తాలిబాన్లు. ఇవన్నీ తాలిబాన్లంటేనే భయాన్ని రెట్టింపు చేస్తున్నాయి.

మరోవైపు ప్రతి ఇంట్లో జరుపుతున్న సోదాలు ప్రతీకారం తీర్చుకుంటారనే అనుమానం కలిగిస్తుంది. గతంలో యూఎస్, నాటో సంస్థలకు సహకారం అందించిన వారిని లక్ష్యంగా తాలిబాన్ కదలికలు ఉన్నాయని ఐక్యరాజ్యసమితికి ఇంటెలిజెన్స్ అందించే ఆర్‌హెచ్ఐపీటీవో నార్వేయిన్ సెంటర్ ఫర్ గ్లోబల్ అనాలిసిస్ హెచ్చరించింది.

‘వారు లొంగకపోతే, వారి కుటుంబ సభ్యులను అరెస్టు చేసి, విచారించి, శిక్షించాలని భావిస్తున్నారు’ అని రిపోర్టులో ఉంది. తాలిబాన్ బ్లాక్ లిస్టులో ఉన్న వారంతా పెనుప్రమాదంలో ఉన్నట్లే అని హెచ్చరించారు. పెద్ద ఎత్తున ఉరి శిక్షలు విధించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ మాట్లాడుతూ, అంతర్జాతీయ గుర్తింపు కోసం తాలిబాన్‌ తాపత్రయ పడుతోందని పేర్కొన్నారు.

తాలిబాన్ మారారని అనుకుంటున్నారా అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ‘లేదు’ అని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ పేర్కొన్నారు. వారు ‘అస్తిత్వం’ కోసం చూస్తున్నారని చెప్పారు.

‘దౌత్య కార్యాలయాల తాలాలు బద్దలుకొట్టి లోపలకి ప్రవేశించారు. డాక్యుమెంట్ల కోసం అన్నిచోట్లా వెతికారు. కార్యాలయాల బయట పార్క్ చేసిన వాహనాలను తీసుకెళ్లిపోయారు’అని ఆ కథనంలో పేర్కొంది.

మరోవైపు అఫ్గాన్ ప్రభుత్వ గూఢచర్య సంస్థ ఎన్‌డీఎస్ కోసం పనిచేసిన వారి కోసం ఇంటింటికీ వెళ్లి తాలిబాన్లు సోదాలు చేపడుతున్నారని హిందుస్తాన్ టైమ్స్ అనే ఇంగ్లీష్ మీడియా తెలిపింది.