Afghanistan: 210 మందికి పైగా ఖైదీలను విడుదల చేసిన తాలిబాన్లు.. ఆందోళనలో ఆఫ్ఘాన్లు

ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారం మారినప్పటి నుంచి, అక్కడి ప్రజలు శాంతిభద్రతలతో పోరాడుతూనే ఉన్నారు.

Afghanistan, Taliban release over 210 Prisoners From Jail: ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారం మారినప్పటి నుంచి, అక్కడి ప్రజలు శాంతిభద్రతలతో పోరాడుతూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితిల్లోనే సోమవారం, తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌లోని జైలులో ఉన్న 210 మందికి పైగా ఖైదీలను విడుదల చేసింది.

ఇస్లామిక్ స్టేట్-ఖొరాసాన్, సిరియా, ఇరాక్ ఆధారిత ఉగ్రవాద గ్రూపులు దేశంలో ప్రజా భద్రతకు ప్రధాన సమస్యగా ఎదుగుతున్నప్పటికీ తాలిబాన్ ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం.

ఆఫ్ఘనిస్తాన్‌పై నియంత్రణ సాధించినప్పటి నుండి తాలిబాన్ వందలాది మంది తీవ్రమైన నేరాలపై జైళ్లలో ఉన్న ఖైదీలను విడుదల చేస్తూ వస్తుంది. నేరస్థులు జనాల్లోకి రావడంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Armed Forces Corona : 70వేల మంది సైనికుల‌కు క‌రోనా, 190 మంది మృతి

ఈ సంవత్సరం ప్రారంభంలో, తాలిబాన్ హెల్మాండ్, ఫరా ప్రావిన్సులలోని జైళ్ల నుండి 600 మందికి పైగా ఉగ్రవాదులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో 210మందిని బయటకు వదలడం వారి భయానికి కారణం అవుతోంది.

ఆఫ్ఘనిస్తాన్‌లో ఘనీ ప్రభుత్వం పతనం తర్వాత దేశంలో అనేక దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను నిలువరించడంలో తాలిబన్లు విఫలమైనట్లుగా ఇప్పటికే ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. బాంబు దాడులు, కాల్పులతో ఆఫ్ఘాన్ అల్లాడిపోతుంది.

CM Jagan : జనంలోకి జగన్‌.. డిసెంబర్ 2 నుంచి నేరుగా…

ట్రెండింగ్ వార్తలు